అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత గడ్డపై అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన తన భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్ తో కలిసి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన నేపథ్యంలో... భారత ప్రధాని మోదీ ఘన ఏర్పాట్లు చేశారు. ట్రంప్ తన జీవితంలో ఎప్పుడూ మరచిపోని విధంగా ఉండాలని అట్టహాసమైన ఏర్పాట్లు చేశారు.

ట్రంప్ బస చేసే హోటల్ దగ్గర నుంచి.. తినే ఆహారం దాకా అన్నీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్పెషల్ చెఫ్ ని ఏర్పాటు చేసి.. అంతకన్నా స్పెషల్ మెనూ తయారు చేశారు. వివిధ రకాల వంటకాలను ట్రంప్ కి రుచి చూపించనున్నారు. అయితే... ట్రంప్ భారత్ వచ్చిన క్రమంలో... ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఒక విషయంపై చర్చ జరుగుతోంది.

అందరూ అనుకుంటున్నట్లు ట్రంప్ గురించి అయితే కాదు.. నిజం.. ట్రంప్ ఎందుకు వచ్చాడు..? మన దేశానికి ఏంటి లాభం లాంటివి కాకుండా.. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ వేసుకన్న డ్రస్, కూతురు ఇవాంకా వేసుకున్న దుస్తుల గురించే విపరీతంగా చర్చించేసుకుంటున్నారు.

Also Read హైదరాబాదును గుర్తు చేసుకుంటూ ఇవాంక ట్రంప్ ట్వీట్...

మెలానియా, ఇవాంక విమానం దిగిన దగ్గర నుంచి వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్ మీదే నెటిజన్లు కళ్లు పడటం విశేషం. ఇద్దరూ చాల స్టైలిష్ గా రెడీ అయ్యి వచ్చారు. మెలానియా తెలుపు రంగు జంప్ సూట్ ధరించగా.... ఇక ఇవాంక పింక్ కలర్  ఫ్లోరల్ మిడ్డీ ధరించారు. 

ఇద్దరూ స్టైలిష్ గా కనిపిస్తూనే.. చాలా సింపుల్ గా తయారయ్యారంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అగ్రరాజ్యం నుంచి వచ్చామన్న గర్వం, దర్పం ఎక్కడా కనిపించకుండా.. హుందాగా ప్రవర్తించారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

ఇద్దరూ చాలా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు కూడా ఫోటోలను షేర్  చేస్తున్నారు. ఇక ఇవాంకాతో ఫోటోలు దిగడానికి మొతారా స్టేడియంలో ప్రజలు ఎగబడటం గమనార్హం. అంతేకాకుండా.. రెండు సంవత్సరాల క్రితం ఇవాంకా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. అప్పటి నుంచి ఆమెకు భారత్ లో అభిమానులు బాగా పెరిగిపోవడం విశేషం.