Asianet News TeluguAsianet News Telugu

షమీ పేస్.. అశ్విన్ స్పిన్ మేజిక్: 150కే కుప్పకూలిన బంగ్లాదేశ్

భారత్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇండోర్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150కే ఆలౌటైంది.

Bangladesh allout in indore match
Author
Indore, First Published Nov 14, 2019, 3:26 PM IST

భారత్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇండోర్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150కే ఆలౌటైంది. భారత బౌలర్లు వరుసపెట్టి వికెట్లు తీస్తుండటంతో బంగ్లాదేశ్ కోలుకోలేకపోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఆరంభంలోనే ఓపెనర్లు షాద్‌మన్ ఇస్లామ్, ఇమ్రుల్ కేస్‌లు ప్రారంభించారు. ఇషాంత్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి షాద్‌మన్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అందుకున్నాడు.

ఆ వెంటనే ఉమేశ్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఇమ్రుల్ ఔటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 12 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ మోమినుల్ హక్‌, మిథున్ జంట మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది.

Also Read:గంగూలీ ఎఫెక్ట్.. బద్ధకస్తుడి చేతిలో బాల్: రవిశాస్త్రిని ఆడుకుంటున్న నెటిజన్లు

అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అశ్విన్ ఔట్ చేయడంతో మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం అశ్విన్, షమీలు చెలరేగడంతో బంగ్లాదేశ్ 41 పరుగుల వ్యవధిలో మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత మ్యాచ్ ప్రారంభమైన తొలి బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో లిటన్‌దాస్ ఔటయ్యాడు.

సీనియర్ ఆటగాడు ముష్ఫీకర్ రహీమ్ 43 పరుగులతో ఒక్కడే భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. టీమిండియా బౌలర్లలో షమీ 3, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్ తరపున అత్యంత వేగంగా స్వదేశంలో 250 వికెట్లు సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లా ఆటగాడు మోమినుల్ హక్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు,

అతనికి ఇది స్వదేశంలో 42వ టెస్టు. ఇదే సమయంలో లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో హార్భజన్ సింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. 

Also Read:రిషబ్ పంత్ పై ట్రోల్స్... పట్టించుకోవద్దంటున్న శిఖర్ ధావన్

ఇదిలా ఉండగా... ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 సిరీస్ ని భారత్ కైవసం చేసుకుంది. ఆ సిరీస్ కి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోగా.. కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ చేపట్టాడు. ఇప్పుడు మళ్లీ కోహ్లీ బరిలోకి దిగాడు. 

టెస్టు జట్టులో పెద్దగా మార్పులు లేకపోయినా.. టీ20లో తొలిసారిగా ముంబై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేకు బెర్త్‌ దక్కింది. భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున అతడు అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అలాగే కేరళ యంగ్‌ బ్యాట్స్‌మన్‌ సంజూ శాంసన్‌ కల నాలుగేళ్ల తర్వాత నెరవేరింది. 2015లో జింబాబ్వేపై అతడు ఏకైక టీ20 మ్యాచ్‌ ఆడాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios