టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా జరిగిన చర్చ హెడ్ కోచ్ రవిశాస్త్రి గురించే ఎందుకంటే గతంలో వీరిద్దరి మధ్య ఉన్న విబేధాలు అలాంటివి.

అనిల్ కుంబ్లేకు కోచ్‌గా బాధ్యతలు అప్పగించిన సమయంలో అప్పటి సిఫారసు కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీపై రవిశాస్త్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తనకు దక్కాల్సిన కోచ్ పదవిని కావాలని దాదా అడ్డుకున్నాడని బాహాటంగానే విమర్శించాడు.

ఇందుకు గంగూలీ సైతం ఘాటుగానే బదులిచ్చాడు. తానేమీ కోచ్ పదవిని అడ్డుకోలేదని... అప్పటి పరిస్ధితుల్లో అనిల్ కుంబ్లే సమర్థుడని అతనివైపే మొగ్గుచూపామని రవిశాస్త్రికి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చాడు.

అయితే రవిశాస్త్రి తాను కోరుకున్న విధంగా టీమిండియాకి కోచ్‌గా రాగా.... గంగూలీ ఏకంగా బీసీసీఐకే అధినేతగా వచ్చాడు. ఇప్పుడు దాదా కనుసన్నల్లోనే శాస్త్రి పనిచేయాల్సి వుంటుంది. ఇప్పుడు అదే భయం రవిశాస్త్రిని వెంటాడుతోంది... దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చ నడిచింది.

ఆ భయమో లేదంటే మరేదైనా కారణమో కానీ ఎప్పుడూ క్రికెటర్లకు సూచనలు మాత్రమే ఇచ్చే రవిశాస్త్రి.... బౌలింగ్‌ చేస్తూ కనిపించాడు. క్రికెటర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసే సమయంలో వారికి బౌలింగ్ చేశాడు.

Also Read:బూట్ల లేసులు కట్టుకోలేనివారు ధోనీపై విమర్శలా: రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు

ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రవిశాస్త్రి, అందుకు ‘‘ఓల్డ్ హాబిట్స్ డై హార్డ్’’ అని క్యాప్షన్ పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు, దాదా ఫ్యాన్స్ మరొసారి రవిశాస్త్రిని ట్రోల్  చేస్తున్నారు.

‘ ఓల్డ్ హాబిట్స్ డై హార్డ్’ ఏమీ కాదని.. నువ్వు గంగూలీకి భయపడుతున్నావ్.. అందుకే ఎప్పుడు బద్ధకంగా ఉండే నువ్వు ఇవాళ బౌలింగ్ చేస్తున్నావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడైన వెంటనే కనిపించిన మార్పు ఏదైనా ఉందంటే అది రవిశాస్త్రే అంటూ ఇంకొందరు సెటైర్లు వేశారు.

రవిశాస్త్రి మరోలా వాడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. రవిశాస్త్రి ఎప్పటివరకు కోచ్ గా కొనసాగుతాడో అప్పటి వరకు అతని సేవలను ఏఎన్సీఏ లో కూడా భాగం చేస్తామని తెలిపారు.

ద్రవిడ్ తోపాటు రవిశాస్త్రి, పారాస్ మాంబ్రే, భరత్ అరుణ్ లు కూడా ఇందులో పనిచేస్తారని తెలిపారు. ప్రస్తుతం ఎన్సీఏ చాలా పని జరుగుతుందన్నారు. ఎన్సీఏను ఒక అత్యుధ్బుత సెంటర్ గా రూపొందించే ప్రయత్నంలో ఉన్నామన్నారు.

ఇదిలా ఉండగా..అసలు గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవి చేపడుతున్నాడు అనగానే... అందరి దృష్టి రవిశాస్త్రి మీదే పడింది. ఎందుకంటే వీరిద్దరికీ పడదని అందరి తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఓ విలేకరి.. టీం ఇండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో మాట్లాడారా అంటూ గూంగూలీని ఓ ప్రశ్న వేశారు.

Also Read:రవిశాస్త్రిని మరోలా వాడుకుందాం... గంగూలీ కామెంట్స్

ఈ ప్రశ్నకు ఆయన సమాధానం అందరినీ ఆకట్టుకుంది. రవిశాస్త్రి ఏం చేశాడని నేను ఇప్పుడు మాట్లాడాలి? అని చెప్పి.. గంగూలీ పెద్దగా నవ్వేశాడు. స్పాంటినేయస్ గా... గంగూలీ చెప్పిన సమాధానం అందరి చేత నవ్వులు పూయించింది.

గంగూలీ- రవిశాస్త్రి నడుమ ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే... రవిశాస్త్రిని ఇబ్బందిపెట్టే అవకాశం ఉందనే వాదన కూడా వినపడుతోంది.