ఈ ఆటలో విరుష్క జోడీతో పాటు.. అనుష్క శర్మ పేరెంట్స్ కూడా పాలుపంచుకోవడం విశేషం. చాలా రసవత్తరంగా సాగిన ఆటకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. కాగా.. ఈ ఆటలో ఎవరు గెలిచారో తెలుసా అంటూ.. అనుష్క అభిమానులను ప్రశ్నించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కంటే ముందే తన సతీమణి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మతో తన ప్రత్యేక ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఈ ప్రేమ‌ప‌క్షులు ఇప్ప‌డు ఇంట్లోనే ఆనందంగా గ‌డుపుతున్నారు. వీలుచిక్కినప్పుడల్లా సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లోకి వస్తున్నారు.

Also Read ఆగు.. కోహ్లీకి చెబుతాం: చాహల్‌కు రోహిత్, బుమ్రా స్వీట్ వార్నింగ్...

ఇటీవల వారికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలను విరుష్క జోడీ అభిమానులతో పంచుకున్నారు. ఒక దాంట్లో అనుష్క.. కోహ్లీ జుట్టుకూడా కత్తిరించింది. కాగా... తాజాగా.. వీరు మోనోపోలీ గేమ్ ఆడారు. దానికి సంబంధించిన ఫోటోలను అనుష్క తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

View post on Instagram

ఈ ఆటలో విరుష్క జోడీతో పాటు.. అనుష్క శర్మ పేరెంట్స్ కూడా పాలుపంచుకోవడం విశేషం. చాలా రసవత్తరంగా సాగిన ఆటకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. కాగా.. ఈ ఆటలో ఎవరు గెలిచారో తెలుసా అంటూ.. అనుష్క అభిమానులను ప్రశ్నించారు.

దీనికి తోడు.. అనుష్క తన అభిమానులను ఉద్దేశించి ఓ సందేశాన్ని కూడా రూపొందించారు. కుటుంబ విలువలను తెలియజేస్తూ.. ఆమె పెట్టిన సందేశం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

‘‘జీవితంలో ఎలా ఎదగాలి అన్న విషయం మనకు కుటుంబమే నేర్పిస్తుంది. ఎలా తినాలి, ఎలా నడవాలి.. ఎలా ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవాలి. ఇలా ప్రతి ఒక్క విషయం మనకు కుటుంబమే నేర్పుతుంది’ అని అనుష్క పేర్కొన్నారు.

అదేవిధంగా అందరూ ఇంట్లోనే ఉండాలని.. క్షేమంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ లాక్ డౌన్ సమయాన్ని కుటుంబంతో గడపడానికి కేటాయించాలని ఆమె సూచించారు.