లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలు నిలిచిపోవడమో, వాయిదాపడటమో జరిగింది. దీంతో క్షణం తీరిక లేకుండా గడిపే క్రికెటర్లంతా కుటుంబసభ్యులతో గడుపుతున్నారు.

అయితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాత్రం అందరికీ భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వార్నర్ తన భార్యాపిల్లలతో కలిసి తెలుగు సినిమా పాటలకు టిక్ టాక్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటున్నారు.

Also Read:తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్య, నటాషాను పెళ్లి కూడా చేసుకున్నాడా...?

ఇప్పటికే బుట్ట బొమ్మ పాటతో పాటు బాహుబలి సినిమాల్లోని పాటలకు టిక్ టాక్ చేసి ఫ్యాన్స్‌ను అలరించాడు. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలోని మైండ్ బ్లాక్ పాటకు స్టెప్పులేశారు.

సుమారు 50 టేక్‌ల అనంతరం తాము సక్సెస్ అయ్యామని వార్నర్ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశాడు. అయితే వార్నర్ దంపతులు అదే పాటకు ఆదివారం కూడా స్టెప్పులేశారు. ఈ సందర్భంగా తన భార్య కాండిస్ మాదిరిగా స్పెప్పులేశారు.

Also Read;ఖేల్ రత్నకు రోహిత్ శర్మ పేరు, ఆటతీరే గీటు రాయి అన్న గంగూలీ!

మైండ్ బ్లాక్ పార్ట్ 2లో ఆమె డ్యాన్స్ ఇరగదీసిందని మెచ్చుకున్నాడు. దీనికి మూడో పార్ట్ కూడా ఉంటుందని వార్నర్ చెప్పుకొచ్చాడు. ‘‘ డియర్.. నీ ముందు తేలిపోయా.. నేను చెత్తగా డ్యాన్స్ చేశా.. నువ్వు మాత్రం స్టెప్పులతో ఇరగదీశావ్. మరో పార్ట్‌తో ముందుకొస్తాం అని వార్నర్ ట్వీట్ చేశాడు.