టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక పాండ్య త్వరలో తండ్రికాబోతున్నాడు. తన ప్రేయసి నటాషా గర్భవతిగా ఉన్నఫొటోతోపాటుగా వారు సీక్రెట్ గా ఈ క్వారంటైన్ సమయంలో పెళ్లి చేసుకున్నారా అనేలా మరొక ఫోటోను పోస్ట్ చేసారు. 

నటాషాతో తన ప్రయాణం చాలా ఎక్సయిటింగ్ గా జరిగిందని, తమ జీవితంలోకి మరొకరిని ఆహ్వానించబోతున్నామని, జీవితంలో ఈ కొత్త దశ కోసం చాలా థ్రిల్లింగ్ గా ఎదురుచూస్తున్నామని, అందరి దీవెనలు, ఆశీర్వాదాలు కోరుతున్నట్టుగా ఫేస్ బుక్ పోస్ట్ పెట్టాడు. 

తాజాగా కొన్ని రోజుల కింద... హార్దిక్ పాండ్యా ఓ పాట కచేరి పెట్టాడు. బాలీవుడ్ సినిమా కేసరీలోని ‘ తేరీ మిట్టీ’ అనే పాటను ఆలపించాడు. కాగా.. ఆ పాట పాడే సమయంలో తన సోదరుడు క్రునాల్ సహాయం కూడా తీసుకున్నాడు. కాగా.. ఇద్దరూ కలిసి పాట అదరగొట్టారు. ఈ వీడియోని హార్దిక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

వీరి పాట కచేరికి హార్దిక్ ప్రియురాలు నటాషా కూడా స్పందించింది. ‘ఓయ్ హోయి’ అని కామెంట్ పెట్టింది. దాని పక్కనే హృదయం ఆకారంలో ఉన్న ఓ ఎమోజీని కూడా పెట్టింది. హార్దిక్ పాటకు తాను ఫిదా అయ్యానంటూ ఎమోజీలతోనే చెప్పేసింది. ఆమె సమాధానం కూడా ఇప్పుడు అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. వీరిద్దరూ ఎంత పీకల్లోతు ప్రేమలో ఉన్నారో సోషల్ మీడియాలో చెప్పకనే చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. గతంలోనూ వీరిద్దరూ తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం పెట్టిన ఓ వీడియోకి అభిమానులు ఫిదా అయిపోయారు. 

హార్దిక్.. తన ప్రేయసి నటాషాతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. కాగా.. అతను తన ప్రేయసికి ప్రేమ పరీక్ష పెట్టాడు. ‘‘ బేబీ.. నేను నీకు ఏమౌతాను’’ అంటూ హార్దిక్.. నటాషాను ప్రశ్నించాడు. దానికి ఆమె అదిరిపోయే సమాధానం చెప్పింది. ‘‘ నువ్వు నా హృదయంలో ఒక భాగం’’ అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. వారి ప్రేమ ఎంత గొప్పదో ఆమె సమాధానంతో తేలిపోయింది.

వీరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్ గా మారింది. అభిమానులు టోటల్ గా ఫిదా అయిపోయారు. కాగా.. గతంలో ఈ లాక్ డౌన్ సమయంలోనే నటాషా.. తన ప్రియుడు హార్దిక్ కోసం కేక్ కూడా తయారు చేసింది.