Asianet News TeluguAsianet News Telugu

కుంబ్లే-హర్భజన్‌ జోడీని వెనక్కి నెట్టిన అశ్విన్-జ‌డేజా..టెస్టుల్లో భారత స్పిన్ జోడీ స‌రికొత్త చ‌రిత్ర

Ashwin-Jadeja : హైద‌రాబాద్ వేదిక‌గా భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో టీమిండియా స్పిన్న‌ర్లు అద‌ర‌గొడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ర‌విచంద్ర‌న్ అశ్విన్, ర‌వీంద్ర‌ జడేజాల స్పిన్ జోడీ భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్లు అనిల్ కుంబ్లే - హర్భజన్‌ సింగ్‌ జోడీని వెన‌క్కినెట్టింది.
 

Ashwin-Jadeja Bowling Pair creates history by overtaking legendary bowlers Anil Kumble-Harbhajan Singh duo RMA
Author
First Published Jan 27, 2024, 5:32 PM IST

India vs England: భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో మూడో రోజు టీమిండియా పైచేయి సాధించింది. ముఖ్యంగా స్పిన్న‌ర్లు అద‌ర‌గొట్టారు. ర‌విచంద్ర‌ అశ్విన్, ర‌వీంద్ర‌ జడేజాలు త‌మ అద్భుత‌మైన బౌలింగ్ తో రెండో ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌ను దెబ్బ‌కొట్టారు. భారీగా ప‌రుగులు చేయ‌కుండా వారిని అడ్డుకున్నాడు. ఈ క్ర‌మంలోనే స‌రికొత్త రికార్డు సృష్టించాడు. భార‌త్ త‌ర‌ఫున విజ‌య‌వంత‌మైన స్పిన్ జోడీగా రికార్డులకెక్కారు. తొలి టెస్టులో అశ్విన్, జ‌డేజాలు మూడేసి వికెట్లు తీసుకోవ‌డంతో భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్లు అనిల్ కుంబ్లే - హర్భజన్‌ సింగ్ ల స్పిన్ జోడీని  వీరు అధిగ‌మించారు.

భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో అశ్విన్‌, జడేజాలు చెరో మూడేసి వికెట్లు తీయ‌డంతో టెస్టుల్లో ఈ జోడీ మొత్తం 506 వికెట్లు తీసినట్లైంది. దీంతో భార‌త్ త‌ర‌ఫున టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన స్పిన్ జోడీగా ఉన్న‌ అనిల్ కుంబ్లే - హ‌ర్భ‌జ‌న్ సింగ్ ల 501 వికెట్ల రికార్డును అశ్విన్-జ‌డేజాల జోడీ అధిగ‌మించింది. అనిల్ కుంబ్లే - హ‌ర్భ‌జ‌న్ సింగ్ జోడీ 54 టెస్టుల‌లో 501 వికెట్లు తీసుకోగా, అశ్విన్-జ‌డేజాల జోడీ కేవ‌లం 50 టెస్టుల్లోనే 506* వికెట్లు తీసుకోవ‌డం విశేషం. ఈ లిస్టులో త‌ర్వాతి స్థానంలో హర్భజన్ సింగ్-జహీర్‌ఖాన్ జోడీ 474 వికెట్లు, ఉమేశ్‌ యాదవ్‌ - అశ్విన్‌ల జోడీ 431 వికెట్లతో ఉన్నారు.

సూప‌ర్ డెలివరీ.. అశ్విన్ స్పిన్ దెబ్బకు బిత్త‌ర‌పోయిన బెన్ స్టోక్స్ ! క‌పిల్ దేవ్ రికార్డు స‌మం !

భార‌త త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన జోడీలు

  1. ర‌విచంద్ర‌న్ అశ్విన్-రవీంద్ర జడేజా జోడీ 50 టెస్టుల‌లో  506* వికెట్లు 
  2. హర్భజన్ సింగ్ & అనిల్ కుంబ్లే  జోడీ 54 టెస్టుల‌లో 501 వికెట్లు 
  3. హర్భజన్ సింగ్ & జహీర్ ఖాన్ జోడీ 59 టెస్టుల‌లో 474 వికెట్లు
  4. ఆర్ అశ్విన్ & ఉమేష్ యాదవ్ జోడీ 52 టెస్టుల‌లో 431 వికెట్లు
  5. అనిల్ కుంబ్లే & జావగల్ శ్రీనాథ్ జోడీ 52 టెస్టుల్లో 412 వికెట్లు 

అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో టాప్-6 బెస్ట్ బౌలింగ్ జోడీలు: 

  1. జేమ్స్‌ అండర్సన్ & స్టువర్ట్‌ బ్రాడ్ - 139 మ్యాచుల్లో 1,039 వికెట్లు
  2. షేన్ వార్న్ & గ్లెన్‌ మెక్‌గ్రాత్ జోడీ 104 మ్యాచుల్లో 1,001 వికెట్లు 
  3. ముర‌ళీధ‌ర‌న్ & చ‌మిందావాస్ జోడీ 895 వికెట్లు
  4. వాల్ష్ & అంబ్రోస్ జోడీ 762 వికెట్లు 
  5. వ‌సీం & వ‌కార్ జోడీ 559 వికెట్లు
  6. అశ్విన్ &జ‌డేజా జోడీ 506* వికెట్లు 

క‌ట్ట‌లు తెంచుకున్న బుమ్రా కోపం.. దెబ్బ‌కు ఎగిరిప‌డ్డ వికెట్ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios