ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గౌతమ్ గంభీర్ ని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ని కడుపుబ్బా నవ్వించాడు. ఈ సంఘటన భారత్‌-బంగ్లాదేశ్‌ తొలి టెస్ట్‌ రెండోరోజు ఆట సందర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. గంభీర్‌, లక్ష్మణ్‌తోపాటు స్టార్‌స్పోర్ట్స్‌ కామెంటేటర్‌ జతిన్‌ సప్రు శుక్రవారం ఇండోర్‌లో టిఫిన్ చేయడానికి వెళ్లారు.

అక్కడ వారు ఓ చాట్‌ భండార్‌లో అటుకులతో చేసిన చాట్‌తోపాటు, జిలేబీ తింటూ నవ్వుల్లో మునిగిపోయారు. ‘అటుకుల వంటకంతో కారంకారంగా.. జిలేబీతో తియ్యని బ్రేక్‌ఫా్‌స్టతో ఇండోర్‌లో ఈరోజు అద్భుతంగా మొదలైంది’ అని లక్ష్మణ్‌ ట్వీట్‌ చేశాడు. ఎప్పుడూ సీరియ్‌సగా ఉండే గంభీర్‌ అలా పెద్దపెట్టున నవ్వడమనే ‘మిషన్‌ ఇంపాసిబుల్‌’ను పాసిబుల్‌ చేశావంటూ ఓ నెటిజన్‌ లక్ష్మణ్‌ను ప్రశంసించాడు. గంభీర్‌ అలా నవ్వడం తొలిసారి చూశానని మరో నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

కాగా..గంభీర్ ఇప్పుడు బీజేపీ ఎంపీ కూడా కావడంతో.. పొలిటికల్ కూడా ఆయనపై ఇప్పుడు జోకులు పేలుతున్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని ఈ ఫోటోతో కలిపి నెటిజన్లు కామెంట్స్ చేయడం, మీమ్స్  క్రియేట్ చేయడం లాంటివి చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.