Asianet News TeluguAsianet News Telugu

థర్డ్ అంపైర్ వల్ల బతికిపోయిన డేవిడ్ వార్నర్... నాలుగు నో బాల్స్ వేసిన బెన్ స్టోక్స్, పట్టించుకోని అంపైర్లు..

గబ్బా టెస్టులో ఒకే ఓవర్‌లో నాలుగు నో బాల్స్ వేసిన బెన్ స్టోక్స్... ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ గీత దాటినా, గుర్తించని ఫీల్డ్ అంపైర్, టీవీ అంపైర్... డేవిడ్ వార్నర్ వికెట్ తర్వాత ఆలస్యంగా...

Ashes 2021: Ben Stokes no balls saved David Warner, Umpires failed to check Ben stokes over-stepping
Author
India, First Published Dec 9, 2021, 10:57 AM IST

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో మొదటి టెస్టులోనే హై డ్రామా నడుస్తోంది. ఆతిథ్య దేశానికి పరిస్థితులు కలిసి వస్తున్నా, అంపైర్ల తప్పిదాల కారణంగా ఆస్ట్రేలియా జట్టు ఏకంగా మూడు అదనపు పరుగులను కోల్పోయింది. థర్డ్ అంపైర్ కాస్త ఏమరుపాటుగా ఉండి ఉంటే, మరింత నష్టం జరిగేదే... గబ్బా టెస్టులో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు, తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

వర్షం కారణంగా తొలి రోజు ఆటకి అంతరాయం కలగడంతో 50.1 ఓవర్లలో పాటే ఆట సాగింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోరీ బర్న్స్, కెప్టెన్ జో రూట్, ఓల్లీ రాబిన్‌సన్ డకౌట్లుగా వెనుదిరగగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ 58 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు, ఓల్లీ పోప్ 79 బంతుల్లో 2 ఫోర్లతో 35 పరుగులు, హసీమ్ హమీద్ 75 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు...
 

టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న ప్యాట్ కమ్మిన్స్, 13.1 ఓవర్లలో 3 మెయిడిన్లలో 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్ రెండేసి వికెట్లు తీయగా, గ్రీన్‌కి ఓ వికెట్ దక్కింది...

Read: గంగూలీ విషయంలో జరిగిందే, విరాట్ కోహ్లీ విషయంలో... వన్డే కెప్టెన్సీని వదులుకోవడానికి...

రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా జట్టు 10 పరుగుల వద్ద ఓపెనర్ మార్కస్ హారీస్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మార్కస్ లబుషేన్ కలిసి రెండో వికెట్‌కి 156 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, ఆస్ట్రేలియాను ఆదుకున్నారు.

ఆసీస్ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో 17 పరుగుల వద్ద ఉన్న డేవిడ్ వార్నర్‌ను బెన్ స్టోక్స్ అవుట్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించిగా, టీవీ అంపైర్ గమనించి, అది నో బాల్‌గా ప్రకటించాడు. నో బాల్‌ కావడంతో లక్కీగా డేవిడ్ వార్నర్ అవుట్ కాకుండా బతికిపోయాడు. 

అయితే అంతకుముందు బెన్ స్టోక్స్ వేసిన మూడు బంతులు, టీవీ రిప్లైలో నో బాల్స్‌గా కనిపించడంతో ఫ్యాన్స్‌ షాక్‌కు గురయ్యారు. ఒకటి, రెండు కాదు... ఏకంగా నాలుగు బంతులు లైన్ దాటి, వేసినా ఫీల్డ్ అంపైర్ గమనించకపోవడం... టీవీ అంపైర్ కూడా దాన్ని గుర్తించి సైరన్ మోగించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

మారిన ఐసీసీ రూల్స్ ప్రకారం బౌలర్ లైన్ దాటి వేసిన నో బాల్స్‌ను ఫీల్డ్‌లో ఉన్న అంపైర్ గుర్తించలేకపోతే, దాన్ని గుర్తించి సైరన్ ద్వారా అతనికి ‘నో బాల్‌’గా సిగ్నల్ ఇచ్చే అధికారం ఉంటుంది. ఏ బ్యాట్స్‌మెన్ అయినా అవుటైన తర్వాత కూడా ఆ బంతి సరైనదే, లేక నో బాల్‌ ఆ... అని తప్పనిసరిగా చెక్ చేయాల్సి ఉంటుంది.

ఇవన్నీ తెలిసి కూడా ఫీల్డ్ అంపైర్, టీవీ అంపైర్ నిద్రపోతున్నారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుంటే, ఇవన్నీ గమనించలేదంటే అది ఆతిథ్య జట్టుకి లాభం చేకూర్చేది అవుతుంది? క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఇలా ఛీటింగ్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బ తీసేందుకు ఆసీస్ ప్రయత్నించిందని తీవ్రమైన ట్రోల్స్ వచ్చేవి...

Read also: విరాట్ కోహ్లీ దూకుడే అతని కెప్టెన్సీ పోవడానికి కారణమైందా... హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఎంట్రీతో...

నో బాల్ కారణంగా బతికిపోయిన డేవిడ్ వార్నర్ 176 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 94 పరుగులు చేసి, సెంచరీకి 6 పరుగులు దూరంలో రాబిన్‌సన్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

మార్నస్ లబుషేన్ 117 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్‌లో అవుట్ కాగా స్టీవ్ స్మిత్ 19 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

కామెరూన్ గ్రీన్ డకౌట్ కాగా 195 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. మెంటల్ హెల్త్ కారణాలతో నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న బెన్ స్టోక్స్, బ్యాటింగ్‌లో 5 పరుగులు చేసి నిరాశపరచగా, బౌలింగ్‌లోనూ రిథమ్ అందుకోలేకపోతున్నాడు.

ఐదో వికెట్ కోల్పోయే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 50+ పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా, మరో 100+పరుగులు చేసినా పర్యటన జట్టుపై పట్టు సాధించే అవకాశం ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios