వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పై శుక్రవారం తొలి టెస్టు జరుగనున్న నేపథ్యంలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ కు టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సలహా ఇచ్చాడు. ఏది జరిగినా సానుకూల దృష్టితో చూసి మన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడమే మన ముందున్న కర్తవ్యమని, అది గుర్తిస్తే ఏ విధమైన ఇబ్బంది ఉండదని ఆయన అన్నాడు. 

మనం ఏం చేస్తున్నామో దాన్ని అంగీకరించమం ముఖ్యమని, ఏది జరిగినా సానుకూల దృక్పథంతోనే ఉండాలని, నేర్చుకుంటూ ముందుకు సాగడమే ఆటగాడిగా మన కర్తవ్యమని ఆయన చెప్పాడు. ఇక్కడ జూనియర్, సీనియర్ అనే తేడా ఏమీ ఉండదని రహానే స్పష్టం చేశాడు. 

Also Read: పుజారా ఇంటర్వ్యూ: 39 ఏళ్ల క్రితం ఇక్కడే అంటూ రవిశాస్త్రి

తుది జట్టులో ఆడకుండా బయట కూర్చోవడానికి ఎవరూ ఇష్టపడరని, ఫాలనా మ్యాచ్ కు సన్నద్ధం కావాలో దానిపై మాత్రమే మేనేజ్ మెంట్ దృష్టి పెడుతుందని ఆయన అన్నారు. దాన్ని నువ్వు తప్పకుండా అంగీకరించాల్సి ఉంటుందని చెప్పాడు. మన వ్యక్తిగత ప్రదర్శన అనేదే చాలా ముఖ్యమని చెప్పాడు. 

మన ప్రదర్శన బాగా లేకపోతే నైపుణ్యాన్ని పెంచుకుని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని, అందుకు సిద్ధంగా ఉండాలని రహానే అన్నాడు.  నీ ఆటను మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెడితే అవకాశం తప్పకుండా వస్తుందని అన్నాడు. 

ముందు నీ పాత్ర ఏమిటో తెలుసుకోవాలని, రిషబ్ పంత్ తన పాత్ర ఏమిటో ఒకసారి విజువలైజ్ చేసుకోవాలని, అప్పుడు అతనికి పరిష్కారం దొరుకుతుందని, తన శక్తిసామర్థ్యాలపై పంత్ దృష్టి కేంద్రీకరించి, మరిత పదును పెట్టుకోవాలని రహానే చెప్పాడు.

Also Read: ఔర్ ఏక్ దక్క, ఫైనల్ బెర్త్ పక్కా: న్యూజీలాండ్ టెస్టు సిరీస్ తో టెస్టు వరల్డ్ కప్ పై గురిపెట్టిన భారత్

ధోనీ దూరమైన నేపథ్యంలో అన్ని ఫార్మాట్లకు ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా ముందుకు వచ్చిన రిషబ్ పంత్ కొంత కాలంగా రిజర్వ్ బెంచీకి పరిమితమవుతున్నాడు. రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ సక్సెస్ కావడమే అందుకు కారణం. అయితే, న్యూజిలాండ్ టెస్టు సిరీస్ కు కేఎల్ రాహుల్ లేకపోవడంతో రిషబ్ పంత్ కు అవకాశం దక్కవచ్చు. అయితే, వృద్ధిమాన్ సాహా కూడా ఉండడంతో రిషబ్ పంత్ కు తుది జట్టులో స్థానం దక్కుతుందా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది.