మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన భారత్, ఆ తర్వాత సిడ్నీలో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది. పలువురు సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ, బ్రిస్బేన్‌లో జరిగిన సిరీస్‌లో భారత్‌ విజయం సాధించింది.

2020-21 లో టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. ఆ టెస్టు సిరీస్ లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించి.. రికార్డు సాధించింది. టీమిండియా ఈ విజయాన్ని ఎవరూ మర్చిపోలేరు. టీమ్ గెలవడంతో పాటు.. రహానే కెప్టెన్సీని కూడా అందరూ మెచ్చుకున్నారు. అప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీనే. అయితే.. కోహ్లీ నేతృత్వంలో మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది. ఆ తర్వాత.. తన భార్య కు డెలివరీ టైమ్ దగ్గరపడటంతో.. కోహ్లీ ఇంటికి చేరుకోగా... రహానే.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచుల్లోనూ భారత్ అదరగొట్టి.. అద్భుత విజయం సాధించింది.

మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన భారత్, ఆ తర్వాత సిడ్నీలో జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకుంది. పలువురు సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ, బ్రిస్బేన్‌లో జరిగిన సిరీస్‌లో భారత్‌ విజయం సాధించింది.

అయితే... సిడ్నీలో ఆసీస్​తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో టీమ్​ఇండియా బౌలర్లు బుమ్రా, మహ్మద్​ సిరాజ్​ జాతి వివక్షకు గురయ్యారు. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ మేరకు విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత జట్టు ఫిర్యాదు చేసింది. వీక్షకుల గుంపు నుంచి గుర్తుతెలియని కొంతమంది తాగుబోతులు సిరాజ్​ను తీవ్రంగా అవమానించారని లేఖలో పేర్కొన్నారు.

కాగా.. ఆ నాటి సంఘటనను తాజాగా రహానే మరోసారి గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తప్ప.. తాము ఆట ఆడబోము అని ఆరోజు తాను అంపైర్లకు చెప్పినట్లు రహానే తెలిపాడు. అయితే.. తాము గేమ్ ఆపలేమని అంపైర్లు తమతో చెప్పారని రహానే పేర్కొన్నాడు. అయితే.. దానికి సమాధానంగా ‘ మేము ఇక్కడ ఆడేందుకు వచ్చామని, డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోవడం లేదని, దుర్వినియోగదారులను గ్రౌండ్ నుండి బయటకు తీసుకురావాలని పట్టుబట్టాము. ఇది చాలా ముఖ్యం. మా సహోద్యోగికి అతను ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి మద్దతు ఇవ్వండి. సిడ్నీలో జరిగింది పూర్తిగా తప్పు.’ అని రహానే ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.