Virat Kohli had a video call with family : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ (ఐపీఎల్ 2024) లో తొలి మ్యాచ్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన హోం గ్రౌండ్ లో రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన కుటుంబంతో వీడియో కాల్ మాట్లాడిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Royal Challengers Bangalore vs Punjab Kings: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీమీ) తన హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ పేరు మారుమోగిపోయింది. బెంగళూరు.. కింగ్ కోహ్లీ అభిమానుల సందడి మరో రెంజ్ లో ఉండటంతో స్టేడియం హోరెత్తింది. కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి బెంగళూరుకు ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందించాడు.
పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు తర్వాత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్ లకు వీడియో కాల్ చేసిన ఒక అందమైన క్షణాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని జట్టు, శిఖర్ ధావన్ అండ్ కో మధ్య జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, యశ్ దయాళ్, అల్జారీ జోసెఫ్ చెరో వికెట్ తీయడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో పీబీకేఎస్ ను 6 వికెట్ల నష్టానికి 176 పరుగులకే కట్టడి చేసింది.
177 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ విజయంలో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 77 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. చివరలో తడబడిన దినేష్ కార్తీక్ ఫటాఫట్ ఇన్నింగ్స్ తో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చేసిన ఒక పని అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వీడియో కాల్ లో ఎవరితోనో సంభాషించడం, చాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే తన కుటుంబ సభ్యులు అనుష్క శర్మ, వామిక, ఆకేలతో ఫోన్ లో ఉన్నానని స్పష్టమైంది. ఈ సంభాషణలో కోహ్లీ కొన్ని ఫన్నీ హావభావాలు చేస్తూ కనిపించాడు. కాల్ ముగించే ముందు విరాట్ తన కుటుంబానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ మధ్యలో సెక్యూరిటీని బ్రేక్ చేసి విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్.. వీడియో వైరల్
