fan touches Virat Kohli's feet : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. అయితే, ఈ మ్యాచ్ మధ్యలో సెక్యూరిటీని దాటుకుని కింగ్ కోహ్లీ కాళ్లు మొక్కిన ఫ్యాన్ వీడియో వైరల్ అవుతోంది.
Royal Challengers Bangalore vs Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో తొలి మ్యాచ్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన హోం గ్రౌండ్ లో రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. ఐపీఎల్ 2024లో తొలి విజయాన్ని నమోదుచేసింది. బెంగళూరు మ్యాచ్ అంటే క్రికెట్ లవర్స్ కు పునకాలు రావడం ఖాయమనేది తెలిసిందే. గెలుపోటములతో సంబంధం లేకుండా కింగ్ కోహ్లీ టీమ్ బెంగళూరుకు అద్భుతమైన మద్దతు తెలుపుతుంటారు. చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్ లో జరిగిన తొలి మ్యాచ్ లో కూడా అభిమానుల హోరు మాములుగా లేదు.
కోహ్లీ.. కోహ్లీ అంటూ గ్రౌండ్ ను హోరెత్తించారు. కింగ్ కోహ్లీ సైతం ధనాధన్ ఇన్నింగ్స్ తో మరోసారి తన బ్యాట్ పవర్ ఎంటో నిరూపించాడు. 49 బంతుల్లో 77 పరుగులు చేసి తన బెంగళూరు జట్టుకు విజయాన్ని అందించాడు. తన ఇన్నింగ్స్ లో కోహ్లీ 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో చోటుచేసుకున్న ఓ ఘనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కింగ్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సెక్యూరిటీని దాటుకుని గ్రౌండ్ లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కాడు ఒక అభిమాని. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది కోహ్లీ అభిమానిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.
గతంలో విరాట్ కోహ్లీకి దగ్గరవ్వడానికి అభిమానులు భద్రతను ఉల్లంఘించిన సందర్భాలు చాలానే జరిగాయి. విరాట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన కోహ్లీ అసమానమైన ప్రజాదరణను మరోసారి నిరూపించింది. మ్యాచ్‌లో బంతిని ఎదుర్కొనేలోపే ఈ ఘటన చోటు చేసుకుంది. కోహ్లీ బ్యాటింగ్ క్రీజు వైపు నడుస్తుండగా ఒక అభిమాని భద్రతను ఉల్లంఘించి అతనికి దగ్గరగా వెళ్లగలిగాడు. బ్యాటింగ్‌కు దిగిన సూపర్‌స్టార్‌ను కౌగిలించుకోవడానికి లేచి నిలబడే ముందు ఓ అభిమాని విరాట్ కోహ్లీ కాళ్లపై పడ్డాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది పరుగున వచ్చి కోహ్లీ అభిమానిని తీసుకెళ్లారు.
