Asianet News TeluguAsianet News Telugu

AFG vs RSA : అద‌ర‌గొడుతార‌నుకుంటే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఇలా ఔట్ అయ్యారేంది మామా.. !

AFG vs RSA, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు తొలిసారిగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. కీల‌క‌మైన‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ జ‌ట్టు పూర్తిగా విఫ‌ల‌మైంది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల విధ్వంసం ఈ మ్యాచ్ లో క‌నిపించింది.
 

AFG vs RSA :  Afghanistan's hopes dashed as  Africa reach the final of the T20 World Cup for the first time RMA
Author
First Published Jun 27, 2024, 9:20 AM IST

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. అద‌ర‌గొడుతార‌నుకున్న ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు టోర్నీ నుంచి ఔట్ చేసి టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు తొలిసారిగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. కీల‌క‌మైన‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. కేవ‌లం ఒక్క బ్యాట‌ర్ మాత్ర‌మే డ‌బుల్ డిజిట్ ప‌రుగులు (అజ్మతుల్లా 10 ప‌రుగులు) చేశాడు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు విధ్వంసం సృష్టించి ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చారు. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయానికి పునాది వేసి తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేర్చింది ఫాస్ట్ బౌలర్లే.

ఇంతకు ముందు దక్షిణాఫ్రికా జట్టు వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకోలేదు. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రోటీస్ జ‌ట్టు అద్భుత‌మైన బౌలింగ్ తో ఆఫ్ఘ‌న్ ను దెబ్బ‌కొట్టింది. ఆ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్లు వ‌రుస‌గా వికెట్లు తీసుకుని 11.5 ఓవ‌ర్ల‌లో 56 ప‌రుగుల‌కు ఆఫ్ఘ‌న్ జ‌ట్టును ఆలౌట్ చేశారు. స్వాల్ప టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 8.5 ఓవ‌ర్ల‌లో ఒక వికెట్ కోల్పోయి 60 ప‌రుగుల‌తో విజ‌యాన్ని అందుకుంది. 9 వికెట్ల తేడాతో ప్రోటీస్ జ‌ట్టు భారీ విజ‌యాన్ని అందుకుంది. 

29న ఫైన‌ల్ మ్యాచ్ లో.. 

టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికా భారత్ లేదా ఇంగ్లండ్‌తో తలపడవచ్చు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటల నుంచి గయానా నేషనల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ vs ఇంగ్లండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 29న టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఇప్పుడు ట్రోఫీని గెలుచుకునేందుకు మూడు దేశాల మధ్య గట్టి పోటీ నెలకొంది. టీ20 ప్రపంచకప్ ట్రోఫీని తొలిసారి దక్షిణాఫ్రికా, మూడోసారి ఇంగ్లండ్, రెండోసారి భారత్ ట్రోఫీని గెలుచుకునే అవకాశం ఉంది.

ర‌షీద్ ఖాన్ నిర్ణ‌యం ఆఫ్ఘనిస్థాన్ ను  ఔట్ చేసింది..

ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుని దక్షిణాఫ్రికా జట్టుకు బౌలింగ్ అప్పగించాడు. రషీద్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం అతని సొంత జట్టుకు బిగ్ షాకిచ్చింది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై దక్షిణాఫ్రికా బౌలర్లు విధ్వంసం సృష్టించారు. సెమీఫైనల్ లాంటి ముఖ్యమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఆఫ్ఘనిస్థాన్ జట్టు 11.5 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. రహ్మానుల్లా గుర్బాజ్ (0), ఇబ్రహీం జద్రాన్ (2), గుల్బాదిన్ నైబ్ (9), మహ్మద్ నబీ (0), నంగ్యాల్ ఖరూతీ (2), అజ్మతుల్లా ఉమర్జాయ్ (10), కరీం జనత్ (8), నూర్ అహ్మద్ (0), రషీద్ ఖాన్ . (8), నవీన్ ఉల్ హక్ (2) ఇలా వ‌చ్చి అలా పెవిలియ‌న్ కు చేరారు. దక్షిణాఫ్రికా తరఫున మార్కో జాన్సన్, తబ్రేజ్ షమ్సీ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అలాగే, కగిసో రబడ, ఎన్రిక్ నార్ట్జే లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఫైనల్‌కు ప్రోటీస్ జ‌ట్టు

టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా ఫైనల్‌కు చేరేందుకు దక్షిణాఫ్రికా జట్టు 56 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సులువుగానే ఛేదించింది. ఈ సులువైన టార్గెట్ ను అందుకోవ‌డంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. దక్షిణాఫ్రికా జట్టు 8.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 60 పరుగులు చేసి తొలిసారి 2024 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 67 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా తరఫున ఓపెనర్ రిజా హెండ్రిక్స్ అత్యధికంగా 29 పరుగులు చేయగా, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ 23 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

T20 WC 2024: టీ20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో కొత్త రూల్స్.. ? అలా జ‌రిగితే భార‌త్ లాభ‌మేనా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios