ధోని, కేఎల్ రాహుల్ చెత్త రికార్డు జాబితాలో చేరిన అభిషేక్ శ‌ర్మ‌..

Abhishek Sharma joins MS Dhoni, KL Rahul : జింబాబ్వేతో జ‌రిగిన తొలి మ్యాచ్ లో భార‌త జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. ఆతిథ్య జట్టు చేతిలో 13 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన ఐపీఎల్ స్టార్లు రియార్ ప‌రాగ్, అభిషేక్ శ‌ర్మ‌, ధ్రువ్ జురెల్ లు ఫ్లాప్ షో చూపించారు.
 

Abhishek Sharma joins MS Dhoni, KL Rahul in unwanted record list after getting out on duck vs ZIM in 1st T20I RMA

Indians with ducks on T20I debut: ఐదు టీ20 మ్యాచ్ ల‌ సిరీస్‌లో భాగంగా  జ‌రిగిన‌ తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫ‌లం కావ‌డంతో వారం క్రితం ప్రపంచ చాంపియ‌న్ గా నిలిచిన జ‌ట్టును ప్ర‌పంచ క‌ప్ కు అర్హ‌త సాధించ‌ని జింబాబ్వే ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. క్లైవ్ మదాండే 29 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 19.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. శుభ్ మ‌న్ గిల్, వాషింగ్ట‌న్ సుందర్ మినహా మరే బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో ఎక్కువ‌సేపు నిల‌వ‌లేక‌పోయారు. ఈ విజ‌యంతో జింబాబ్వే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. జింబాబ్వేతో ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది మూడో ఓటమి.

ఈ మ్యాచ్‌లో టీం ఇండియా తరఫున అరంగేట్రం చేసిన ముగ్గురు ఐపీఎల్ స్టార్ ప్లేయ‌ర్లు జింబాబ్వేపై ఫ్లాప్ షో చూపించారు. ఐపీఎల్ లో హైద‌రాబాద్ త‌ర‌ఫున సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శ‌ర్మ జింబాబ్వేపై ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అలాగే, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ కూడా రాణించ‌లేక‌పోయారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్ 2024లో తమ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. దీని కార‌ణంగానే వీరికి భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కింది. కానీ, తొలి మ్యాచ్ లో పేద్ద ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌లేక‌పోయారు.

ధోని, కేఎల్ రాహుల్ చెత్త రికార్డు జాబితాలోకి అభిషేక్ శ‌ర్మ‌..

అరంగేట్ర ఆటగాడు అభిషేక్ శర్మ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌ను మరచిపోలేని విధంగా చెత్త రికార్డుతో ప్రారంభించాడు. జింబాబ్వేతో శనివారం జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో జట్టు మొదటి టీ20 మ్యాచ్ లో  భారత కొత్త‌ ఓపెనింగ్ బ్యాటర్ గా బ్యాటింగ్ కు దిగి డకౌట్ అయ్యాడు. హరారేలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ తో క‌లిసి అభిషేక్ ఓపెనింగ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ ఆఫ్ స్పిన్నర్ బ్రియాన్ బెన్నెట్ అద్భుత‌మైన బౌలింగ్ తో శ‌ర్మ‌ను ఉక్కిరిబిక్కిరి చేసి చివ‌ర‌కు ఔట్ చేశాడు. దీంతో టీ20 క్రికెట్ లో అరంగేట్రంలో డకౌట్ అయిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ చేరాడు.

T20I అరంగేట్రంలో డకౌట్ భార‌త ప్లేయ‌ర్లు 

2006లో IND vs SA మ్యాచ్ లో ఎంఎస్ ధోని

2016లో IND vs ZIM మ్యాచ్ లో కేఎల్ రాహుల్

2021లో IND vs SL మ్యాచ్ లో పృథ్వీ షా

2024లో IND vs ZIM మ్యాచ్ లో అభిషేక్ శర్మ

టీమిండియా ఓట‌మికి టాప్-5 కార‌ణాలు ఇవే..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios