సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన అవీ భరోట్ గుండెపోటుతో మృతి... సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 53 బంతుల్లో 122 పరుగులు చేసిన  29 ఏళ్ల అవీ భరోట్..

ఐపీఎల్ 2021 సీజన్ ముగిసి, సీఎస్‌కే విజయంతో సంబరాల్లో ఉన్న క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. 29 ఏళ్ల సౌరాష్ట్ర క్రికెటర్ అవీ భరోట్, గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన అవీ భరోట్, హర్యానాతో పాటు గుజరాత్ వంటి జట్ల తరుపున దేశవాళీ టోర్నీల్లో పాల్గొన్నాడు...

ఫస్టక్లాస్ క్రికెట్‌లో 1547, లిస్టు ఏ క్రికెట్‌లో 1030, టీ20ల్లో 717 పరుగులు చేసిన అవీ భరోట్, 29 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...‘సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో ప్రతీ ఒక్కరినీ ఈ వార్త కలిచివేసింది. అవీ భరోట్ లేని లోటు తీర్చలేనిది. సౌరాష్ట్ర క్రికెటర్‌గా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు..’ అంటూ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) అధికారిక ప్రకటన చేసింది...

Scroll to load tweet…

సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడైన భరోట్, 21 రంజీ మ్యాచులు, 17 లిస్టు ఏ మ్యాచులు, 11 దేశవాళీ టీ20 గేమ్స్ ఆడాడు...2011లో అండర్‌19 టీమిండియా కెప్టెన్‌గా ఉన్న భరోట్, సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 122 పరుగులు చేసి అదరగొట్టాడు...

Scroll to load tweet…

అవీ భరోట్ మృతిపై భారత మాజీ క్రికెటర్, కోచ్ వసీం జాఫర్ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశాడు. ‘అవీ భరోట్ లేడనే వార్త తెలిసి షాక్ అయ్యాను. 29 ఏళ్లలో గుండెపోటుతో చనిపోవడం ఏంటో అంతుపట్టడం లేదు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు వసీం జాఫర్..

ఇదీ చదవండి: సీఎస్‌కే ఊర మాస్ కమ్‌బ్యాక్... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ కూడా చేరకుండా, ఈ సీజన్‌లో టైటిల్ గెలిచి...

 IPL2021 Final: తన Ex- టీమ్‌పై కసి చూపించిన ఊతప్ప... అప్పుడు కేకేఆర్ తరుపున ఆడి, ఇప్పుడు సీఎస్‌కేకి...

IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా...IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...