Asianet News TeluguAsianet News Telugu

అండర్ 19 ఫైనల్స్ లో అతి: ఆ ఐదుగిరిపై ఐసీసీ సీరియస్

 బంగ్లా నుంచి తవ్‌హిద్‌ హృదోయ్‌, షమీమ్‌ హుస్సేన్‌, రకీబుల్‌ హుస్సేన్‌, భారత్‌ నుంచి రవి బిష్ణోయ్‌, ఆకాశ్‌ సింగ్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనందంలో బంగ్లాదేశ్‌ యువ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. విజయానికి అవసరమైన సింగిల్‌ రాగానే ఆటగాళ్లంతా ఉద్వేగంతో మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు. 

2 Indian, 3 Bangla players found guilty by ICC for brawl after U-19 World Cup final
Author
Hyderabad, First Published Feb 11, 2020, 10:58 AM IST

అండర్‌19 ప్రపంచకప్‌ ఫైనల్లో బంగ్లా జట్టు ట్రోఫీని ముద్దాడింది. చివరి వరకు పోరాటం చేసిన భారత కుర్రాళ్లు.. పరాజయం చవి చేశారు. ఫైనల్స్ లో కప్పు చేజార్చుకున్నారు. అయితే... కప్ గెలిచిన ఆనందంలో బంగ్లా కుర్రాళ్లు చేసిన అతిపై ఐసీసీ సీరియస్ అయ్యింది. 

 కుర్రాళ్ల శ్రుతిమించిన అతి ఉత్సాహంపై చర్యలు తీసుకోవడానికి ఐసీసీ రెడీ అయింది. బంగ్లాదేశ్‌ నుంచి ముగ్గురు ప్లేయర్లపై, భారత్ నుంచి ఇద్దరిపై చర్యలు తీసుకోనునట్లు ఐసీసీ ప్రకటించింది. బ్రీచింగ్‌ కోడ్‌ లెవల్‌ 3 కింద ఈ ఐదుగురిపై శిక్ష పడనుంది.

Also Read మా వాళ్లు అతి చేశారు.. క్షమించండి: బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ...

  బంగ్లా నుంచి తవ్‌హిద్‌ హృదోయ్‌, షమీమ్‌ హుస్సేన్‌, రకీబుల్‌ హుస్సేన్‌, భారత్‌ నుంచి రవి బిష్ణోయ్‌, ఆకాశ్‌ సింగ్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆనందంలో బంగ్లాదేశ్‌ యువ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. విజయానికి అవసరమైన సింగిల్‌ రాగానే ఆటగాళ్లంతా ఉద్వేగంతో మైదానంలోకి పరిగెత్తుకొచ్చారు. 

వస్తూనే భారత ఆటగాళ్ల మీదకు వెళ్తూ గేలి చేస్తున్నట్టుగా అరిచారు. ముఖ్యంగా పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం భారత ఆటగాళ్లపై  అభ్యంతకర వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. ఇక.. ఓ రిజర్వ్‌ ఆటగాడు ఏకంగా గొడవకు దిగడంతో సహించని ఓ భారత క్రికెటర్‌ అతడిని నెట్టివేయడంతో అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 

ఈ గొడవపై ఫైనల్‌లోని వీడియో ఫుటేజీలను ఐసీసీ అధికారులు  పరిశీలించనున్నారు.  వాటిని పరిశీలించిన తర్వాత ఆ ఐదుగురు క్రికెటర్లపై  చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ చర్యలు ఎలా ఉంటాయో కూడా తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios