T20 World Cup 2024 : సూర్యకుమార్ యాదవ్ అజేయ హాఫ్ సెంచరీ, పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 4 వికెట్ల సూపర్ బౌలింగ్ తో న్యూయార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో అమెరికాను ఓడించింది. అయితే, మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమానులు రచ్చరచ్చ చేశారు.
Diwali Ho Ya Holi, Anushka Loves Kohli : ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న భారత్ స్టార్ ప్లేయర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. టీ20 ప్రపంచ కప్ 2024 లో భారత్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన కోహ్లీ ఇప్పటివరకు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఈ టీ20 వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచ్ లలో నిరాశపరిచాడు. దీంతో కోహ్లీ గురించి కొత్త చర్చ మొదలైంది. ఇదే సమయంలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో.. అతని అభిమానుల రచ్చ గ్రౌండ్ లో ఎలా ఉంటుందో చెప్పే వీడియో ఒకటి వైరల్ గా మారింది.
భారత్ లోనే కాకుండా విదేశాల్లో ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ అభిమానులు అతడిని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఆయనతో సరదాగా గడిపే మూడ్ లో చాలా మంది ఉన్నారు. మళ్లీ అదే సన్నివేశాన్ని న్యూయార్క్ గడ్డపై చేసి చూపించారు. న్యూయార్క్ లోని నస్సావు కౌంటీ స్టేడియంలో బుధవారం భారత్-యూఎస్ఏలు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 110 పరుగులు మాత్రమే చేసింది. అర్ష్ దీప్ సింగ్ సూపర్ బౌలింగ్ తో 4 వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
T20 World Cup 2024: బెంచ్‌కే పరమితమైన స్టార్ ప్లేయర్.. రోహిత్ శర్మ ప్లాన్ అదేనా..
111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ, రిషబ్ పంత్ కొన్ని పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో భారత్ ను గెలిపించాడు. సూర్యాకు తోడుగా శివమ్ దూబే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టాండ్స్ లో నిల్చున్న అభిమానులు విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ గురించి ఫన్నీగా నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైరల్ గా మారాయి.
భారత జట్టు ఫీల్డింగ్ సమయంలో కోహ్లీ బౌండరీ లైన్ వద్ద నిలబడినప్పుడు స్టాండ్స్ లో ఉన్న కోహ్లీ అభిమానులు అతన్ని చూసి ఉత్సాహపడి ఫన్నీ నినాదాలు చేయడం ప్రారంభించారు. '10 రూపే కీ పెప్సీ, కోహ్లీ భాయ్ సెక్సీ.. దివాలి హో యా హోలీ, అనుష్క లవ్స్ కోహ్లీ అంటూ న్యూయార్క్ స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. ఇదేక్కడి మాస్ రా మావా అనేలా కింగ్ కోహ్లీ అభిమానులు అంటే ఇలానే ఉంటదంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. మొత్తం మీద భారత్ విజయంతో మైదానం వెలుపల కోహ్లీ అభిమానుల క్రేజ్ ఓ రేంజ్ లో కనిపించింది.
0 పరుగులు...0 వికెట్లు.. 0 క్యాచ్‌లు.. టీ20 ప్రపంచ కప్ భారత జట్టులోని ఈ ప్లేయర్ ఎవరో తెలుసా?
