పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ సోషల్ మీడియాలో నవ్వులపాలయ్యాడు. తన తోటి క్రికెటర్ పై ఉన్న ప్రేమను చూపించాలన్న ఆనందంలో పప్పులో కాలేశాడు. ఇక అతని ఇంగ్లీష్ పై నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ చేస్తూ... పొట్ట చెక్కలయ్యేలా నవ్వకుండా ఉండలేరు.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల ఉమర్ అక్మల్.. మరో క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో కలిసి మంచి సెల్ఫీ తీసుకున్నాడు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసి.... ‘‘ మదర్ ఫ్రమ్ ఎనదర్ బ్రదర్’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. సాదారణంగా.. బ్రదర్ ఫ్రమ్ ఎనదర్ మదర్ అని వాడతారు. అంటే.. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా.. సొంత సోదరుడు లాంటివాడే అనే అర్థం వచ్చేలా ఈ క్యాప్షన్ ని వాడతారు

అయితే... ఇక్కడ ఉమర్ అక్మల్ దానిని తికమక చేసి.. అర్థం మారిపోయేలా చేశాడు. ఆ పోస్టు పెట్టిన వెంటనే తాను చేసిన తప్పును గుర్తించిన ఉమర్ అక్మల్.. దానిని తొలగించాడు. అయితే... అప్పటికే నెటిజన్లు దానిని పసిగట్టేశారు. దీంతో... ఉమర్ ఆ పోస్టుని డిలీట్ చేసినప్పటికీ.. స్క్రీట్ షార్ట్ రూపంలో వైరల్ అవుతోంది.

Also Read ఓ ఫార్మాట్ కు వీడ్కోలు: విరాట్ కోహ్లీ మనసులో మాట ఇదే..

ఇక ఆ పోస్టుకి వచ్చిన మీమ్స్, ట్రోల్స్, కామెంట్స్ చూస్తే.. పొట్ట చెక్కలవ్వాల్సిందే. ప్రతి ఒక్కరూ అసలు సూక్తి కాకుండా.. దానిని తిప్పి కామెడీగా మార్చి పోస్టు చేయడం విశేషం. అక్కడితో ఆగలేదు. ఆ పోస్టులన్నింటికీ.. ఉమర్ అక్మల్ సూక్తులు(#UmarAkmalQuote) అనే హ్యాష్ ట్యాగ్ కూడా క్రియేట్ చేశారు.

 

‘‘If being crime is handsome then arrest me’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. సాధారణంగా.. అందంగా పుట్టడేమే నేను చేసిన నేరమైతే.. నన్ను అరెస్టు చేయండి అనేది సూక్తి. దానికి ఉమర్ స్టైల్ లో.. నేరంగా చేయడమే  నేను చేసిన అందమైతే నన్ను అరెస్టు చేయండి అంటూ రివర్స్ లో కామెంట్ చేయడం గమనార్హం.

 

‘‘అవకాశం నీ తలుపు కొట్టకపోతే.. నువ్వే ఓ తలుపు నిర్మించుకో ’’ అనేది సూక్తి దానికి కూడా మార్చేసి.. హిలేరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. కొన్ని వందల కామెంట్స్ ఉన్నాయి. ఇక ఉమర్ ఫోటోతో ఉన్న మీమ్స్ చూస్తే.. నవ్వకుండా అసలు ఉండలేరు.  

ఇంకొందరేమో ‘ఎందుకురా నాయనా.. ఇంగ్లిష్‌ రాకపోతే, నీకు తెలిసిన హిందీలో ట్వీట్‌ చేయొచ్చు కదా’ అని ఒకరు ఎద్దేవా చేయగా,  ‘ నీకు పాకిస్తాన్‌ జట్టులో అవకాశం రాకపోతే, దాన్ని దక్కించుకునే ప్రయత్నం గట్టిగా చేయి కానీ ఇలా అభాసు పాలుకావొద్దు’ అని మరొకరు చమత్కరించారు.  ‘An apple a day keeps the doctor away’ అనే సామెతను ‘A doctor a day Keeps the apple away’ అన్నట్లు ఉంది ఉమర్‌ అక్మల్‌ సర్‌ అంటూ విమర్శిస్తున్నారు

ప్రస్తుతం సోషల్ మీడియాలో.. ఉమర్ తన ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యంతో అడ్డంగా బుక్కై... వైరల్ గా మారాడు.