MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి.. ఏమైంది బాసూ.. ఈ బౌలింగ్ తో ఛాంపియన్‌గా నిలుస్తామా?

అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి.. ఏమైంది బాసూ.. ఈ బౌలింగ్ తో ఛాంపియన్‌గా నిలుస్తామా?

IND vs WI : టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలింగ్‌ను చీల్చిచెండాడారు. అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులు సమర్పించుకోగా, విండీస్ 195 పరుగులు చేసింది. ఇలాంటి బౌలింగ్ తో భారత్ ట్రోఫీని గెలుస్తుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 01 2026, 10:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్ పవర్.. బౌలింగ్‌లో తేలిపోయిన భారత్
Image Credit : AFP

ఈడెన్ గార్డెన్స్‌లో విండీస్ పవర్.. బౌలింగ్‌లో తేలిపోయిన భారత్

ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన వారందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ విఫలం
Image Credit : AFP

డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ విఫలం

భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకుండా 43 పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా 16వ ఓవర్లో రోవ్‌మన్ పావెల్ చేతిలో అర్ష్‌దీప్ దెబ్బతిన్నాడు. ఆ ఓవర్లో పావెల్ వరుసగా 6, 6, 4 బాదడంతో పాటు ఒక వైడ్ 5 పరుగులు కూడా రావడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో అర్ష్‌దీప్ తడబడటం విండీస్ స్కోరు పెరగడానికి ప్రధాన కారణమైంది.

36
మిడిల్ ఓవర్లలో పట్టు కోల్పోయిన స్పిన్నర్లు
Image Credit : ANI

మిడిల్ ఓవర్లలో పట్టు కోల్పోయిన స్పిన్నర్లు

భారత స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో విండీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 40 పరుగులు సమర్పించుకున్నాడు. 11వ ఓవర్లో షిమ్రాన్ హెట్మెయర్ వరుణ్ బౌలింగ్‌లో వరుసగా సిక్సర్, ఫోర్ కొట్టి 17 పరుగులు రాబట్టాడు. అక్షర్ పటేల్ కూడా 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. విండీస్ బ్యాటర్లు స్పిన్నర్ల లెంగ్త్‌ను త్వరగా అందిపుచ్చుకుని భారీ షాట్లు ఆడారు.

46
బుమ్రా పోరాటం సరిపోలేదు
Image Credit : X@bcci

బుమ్రా పోరాటం సరిపోలేదు

టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎప్పటిలాగే తన పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో కేవలం 36 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. 12వ ఓవర్లో బుమ్రా ఒకే ఓవర్లో హెట్మెయర్ (27), రోస్టన్ చేజ్ (40)లను అవుట్ చేసి భారత్‌ను రేసులోకి తెచ్చాడు. అయితే ఇతర బౌలర్ల నుండి అతనికి సరైన సహకారం అందలేదు. బుమ్రా యార్కర్లు వేస్తున్న సమయంలో ఇతర బౌలర్లు లెంగ్త్ బంతులు వేసి భారీ సిక్సర్లు సమర్పించుకున్నారు.

56
హార్దిక్ పాండ్యా ధారాళం
Image Credit : BCCI\Twitter

హార్దిక్ పాండ్యా ధారాళం

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్‌లో మిశ్రమ ఫలితాలు సాధించాడు. 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జేసన్ హోల్డర్‌కు వరుసగా 4 డాట్ బంతులు వేసినప్పటికీ, చివరి బంతికి సిక్సర్ ఇచ్చాడు. విండీస్ బ్యాటర్లు హార్దిక్ వేసిన స్లోయర్ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నారు.

66
వరుస సిక్సర్లతో రికార్డులు
Image Credit : Getty

వరుస సిక్సర్లతో రికార్డులు

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టించారు. 11వ ఓవర్లో షిమ్రాన్ హెట్మెయర్ కొట్టిన సిక్సర్‌తో టీ20 ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు (19*) కొట్టిన రికార్డును నెలకొల్పాడు. అలాగే ఈ టోర్నీలో వెస్టిండీస్ జట్టు మొత్తం 70 సిక్సర్లు పూర్తి చేసుకుని ఒకే సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా నిలిచింది. భారత బౌలర్లు స్లాట్లలో బంతులు వేయడం విండీస్ పవర్‌ హిట్టర్లకు వరంగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
IND vs WI: గంభీర్ మైండ్ గేమ్.. సామీ మాస్టర్ ప్లాన్ ! అద్భుతానికి అడుగు దూరంలో భారత్
Recommended image2
IND vs WI : అభిషేక్ శర్మ కొంపముంచాడుగా! వరుస క్యాచ్ డ్రాప్‌లతో భారత్‌కు చుక్కలు చూపించిన విండీస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved