WHO Omicron: ఒమిక్రాన్ విశ్వరూపం.. ఒక్కో దేశంలో ఒక్కోలా !
WHO Omicron: ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిపుణులు డాక్టర్ అబ్దీ మహముద్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌తో ఆస్పత్రిపాలయ్యే పరిస్థితి, మరణాలు సంఖ్య చాలా తక్కువగా ఉందని , కానీ ఇతర దేశాల్లో ఆ వేరియంట్ ఇదే తరహాలో ఉంటుందని భావించకూదన్నారు.
WHO Omicron: కరోనా మహమ్మారి .. ప్రపంచ మానవాళిని వెంటాడుతూనే ఉంది. మనుషులను ముప్పుతిప్పలు పెడుతోంది. కొత్త రూపాలతో మానవాళిపై విరుచుకపడుతోంది. కరోనా డెల్టా వేరియంట్ కొన్నాళ్లు వణికించింది. అబ్బా తీడా పోయింద్రా అనుకునే లోపే మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చిపడింది. ఒమిక్రాన్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వేరియంట్ డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ.. ప్రపంచదేశాలను భయాందోళనలకు గురిచేస్తోంది. తాజా ఓమిక్రాన్ వేరియంట్ గురించి.. ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.
ప్రపంచదేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న.. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని సంచనల విషయాలను వెల్లడించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిపుణులు డాక్టర్ అబ్దీ మహముద్. దక్షిణాఫ్రికాలో ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య, మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉందని డాక్టర్ అబ్దీ మహముద్ పేర్కొన్నారు. అయితే.. ఇతర దేశాలలో ఈ వేరియంట్ ఇలానే ఉంటుందని చెప్పలేమని మాత్రం చెప్పలేమని, ఒమిక్రాన్ స్వభావం, తీవ్రత ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని చెప్పారు.
Read Also: Omicron Cases in AP: ఏపీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. తాజాగా 7 కేసులు
U.N. హెల్త్ ఏజెన్సీకి చెందిన COVID-19 ఇన్సిడెంట్ మేనేజర్ డాక్టర్. అబ్ది మహముద్ మాట్లాడుతూ.. తాజా గణన ప్రకారం.. దక్షిణాఫ్రికాలో తొలి సారి వెలుగులో వచ్చిన కొత్త వేరియంట్ కేసులను 128 దేశాలు ధృవీకరించబడ్డాయని తెలిపారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌తో ఆస్పత్రిపాలయ్యే వారి సంఖ్య గానీ, ఒమిక్రాన్ మరణాలు అత్యల్పంగా ఉన్నాయి. ఇదే తరహాలో ఇతర దేశాల్లో ఉండకపోవచ్చు" అని మహముద్ పేర్కొన్నారు.
Read Also: తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 1000 కేసులు, ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి
మిగితా వేరియంట్లో లేని విధంగా ఒమిక్రాన్‌లో సాంక్రమిక శక్తి ఎక్కువగా ఉందనీ, అమెరికాలో కొవిడ్ కేసుల పెరుగుదల చాలా ఎక్కువగా ఉందని, కేసుల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉందనీ, రోజురోజుకు ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, అలాగే.. ఇంతకముందు వేరియంట్లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపగా.. ఒమిక్రాన్ శరీర పైభాగంపై ప్రభావం చూపుతున్నట్లు అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయని ప్రకటించారు.
Read Also: coronavirus: అమెరికాలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే 10 లక్షల కేసులు !
అయితే.. ఈ వేరియంట్ మీద మరింత స్పష్టత రావాలంటే.. మరిన్ని అధ్యయనాలు చేయవల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలని.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.