తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 1000 కేసులు, ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి
తెలంగాణ (Telangana)లో కొత్తగా 1052 కరోనా కేసులు (corona cases) నమోదవ్వగా.. వైరస్ వల్ల ఇద్దరు (corona deaths in telangana) ప్రాణాలు కోల్పోయారు. 240 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 4,858 యాక్టివ్ కేసులు వున్నాయి
తెలంగాణలో (Telangana) కొవిడ్ మహమ్మారి మరోసారి తిరగబెడుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ తరువాత మళ్లీ తొలిసారిగా రాష్ట్రంలో కొవిడ్ రికార్డుల కేసుల సంఖ్య 1000 మార్క్ దాటింది. గడిచిన 24 గంటల్లో 42,991 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,052 పాజిటివ్ కేసులు (corona cases) నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,84,023కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో కోవిడ్ వల్ల (corona deaths in telangana) మరణించిన వారి సంఖ్య 4,033కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 240 మంది కోలుకున్నారని... రాష్ట్రంలో ప్రస్తుతం 4,858 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అటు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 144కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి 127 మంది శంషాబాద్ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేయగా 8 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటివరకు ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 13,405 మంది ప్రయాణికులు తెలంగాణకు వచ్చారు.
ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 7, జీహెచ్ఎంసీ 659, జగిత్యాల 7, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 14, ఖమ్మం 5, మహబూబ్‌నగర్ 0, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 17, మంచిర్యాల 7, మెదక్ 7, మేడ్చల్ మల్కాజిగిరి 116, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 12, నారాయణపేట 1, నిర్మల్ 0, నిజామాబాద్ 6, పెద్దపల్లి 15, సిరిసిల్ల 2, రంగారెడ్డి 109, సిద్దిపేట 4, సంగారెడ్డి 13, సూర్యాపేట 13, వికారాబాద్ 4, వనపర్తి 2, వరంగల్ రూరల్ 5, హనుమకొండ 15, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి