ఒమిక్రాన్ సహజ వ్యాక్సిన్ కాదు. అది తప్పుడు అభిప్రాయం- ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్
ఒమిక్రాన్ వేరియంట్ సహజ వ్యాక్సిన్ కాదని, ఇది చాలా తప్పుడు అభిప్రాయమని ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ అన్నారు. ఇలాంటి వాదనలు ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగేందుకు కారణమవుతాయని తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.
ఒమిక్రాన్.. ఇప్పుడు ఎవరినోట విన్నా ఇదే మాట. కరోనా కొత్త వేరియంట్ రూపమైన ఒమిక్రాన్ భయపెడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒత్త వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ ను 38 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా తెలిపింది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు మన దేశంలోనూ తన ప్రతాపం చూపుతోంది. గత నెల 2వ తేదీన ఈ కొత్త వేరియంట్ కేసులను మొట్ట మొదటి సారిగా కర్నాటకలో గుర్తించారు. ఇప్పుడు ఈ కేసులు 1500 దాటాయి. దీంతో చాలా మందిలో ఆందోళన ఎక్కువుతోంది.
పన్నా బస్సు ప్రమాద ఘటన : బస్సు డ్రైవర్ కి 190 యేళ్ల జైలు శిక్ష...
నేచురల్ వ్యాక్సిన్ వాదన ప్రమాదకం..
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే చాలా మంది ఈ ఒమిక్రాన్ వేరియంట్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒమిక్రాన్ సహజ వ్యాక్సిన్ గా పని చేస్తుందని తెలుపుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ స్వల్ప లక్షణాలను, స్వల్ప తీవ్రతను కల్గి ఉండటం వల్ల ఇది డెల్టా నుంచి వచ్చే ముప్పు తప్పిస్తుందని సోషల్ మీడియా వేదిక పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డెల్టా నుంచి ప్రజలను రక్షించడానికే ప్రకృతి ప్రసాదించిన సహజ వ్యాక్సినే ఈ ఒమిక్రాన్ అని అభిప్రాయలు వెల్లడిస్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదకరమైన అభిప్రాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సహజ వ్యాక్సిన్ అనే వాదనలు ఎక్కువవుతుండటంతో ప్రముఖ వైరాలజిస్ట్ షామిద్ జమీల్ ఈ విషయంలో స్పందించారు. ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ అది సోకిన తరువాత దీర్ఘకాలికంగా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటున్నారని, ఇలా సహజ వ్యాక్సిన్ అని ప్రచారం చేస్తే ఆ నిర్లక్ష్యం మరింతగా ఎక్కువవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సహజ వ్యాక్సిన్ అని ప్రచారం చేసే వాళ్లు.. ఒమిక్రాన్ సోకిన తరువాత వచ్చే పరిణామాలను దృష్టిలో పెట్టుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
ఇద్దరు పురుషుల మధ్య ప్రేమ.. చివరికి.. !
ఇప్పటికే మన దేశంలో ఎంతో మంది అనేక ధీర్షకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ఇప్పుడు ఒమిక్రాన్ సోకడం వల్ల అలాంటి వారికి మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ఒమిక్రాన్ సోకడం వల్ల స్వల్ప లక్షణాలు, స్వల్ప తీవ్రత మాత్రమే ఉంటున్న మాట వాస్తవమే అని, కానీ అది వ్యాక్సిన్ మాత్రం కాదని తెలిపారు. ఈ విషయంలో పలువురు నిపుణులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు. గతంలో కరోనా సోకిన వారు గుండె, కిడ్నీ, లంగ్స్, బ్రెయిన్ సమస్యలతో బాధపడ్డారని తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వారికి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలియదని.. కాబట్టి ఒమిక్రాన్ సోకడం మంచిదనే వాదన విడనాడాలని తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వారిలో పలువురు హాస్పిటల్‌లో చేరారని తెలిపారు. కాబట్టి ఈ ఒమిక్రాన్ పట్ట ప్రజల్లో నిర్లక్ష్య ధోరణిని పెంచే ప్రచారాలు చేయకూడదని వారికి సూచించారు. ప్రజలు కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.