కరోనా విస్ఫోటనం: అమెరికాలో వెయ్యి దాటిన మరణాలు, ట్రంప్ భారీ ప్యాకేజీ

కరోనా ధాటికి ప్రపంచ పెద్దన్న వణికిపోతున్నాడు. నిర్లక్ష్యం, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అమెరికా చేజేతులా ఈ పరిస్ధితి తెచ్చుకుంది. మరణాల్లో ఇటలీని అందుకునే దిశగా అమెరికా దూసుకెళ్తోంది

Coronavirus: US Death Toll At 1,000

కరోనా ధాటికి ప్రపంచ పెద్దన్న వణికిపోతున్నాడు. నిర్లక్ష్యం, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అమెరికా చేజేతులా ఈ పరిస్ధితి తెచ్చుకుంది. మరణాల్లో ఇటలీని అందుకునే దిశగా అమెరికా దూసుకెళ్తోంది.

ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4 రోజుల క్రితం 300 ఉండగా అది ఇప్పుడు 1,000 దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 223 మంది ప్రాణాలు కోల్పోవడంతో అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.

Also Read:కరోనా వైరస్ పై అమెరికా శాస్త్ర వేత్త షాకింగ్ కామెంట్స్

న్యూయార్క్, వాషింగ్టన్, లూసియానా, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్, ఉత్తర కరోలినా, ఫ్లోరిడా, మిచిగాన్, లోవా తదితర రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 30 వేల మంది బాధితులుగా మారగా, 285 మంది మరణించారు.

ఇప్పటికే అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అలాగే కరోనా దెబ్బకు కుదేలైన ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టేందుకు, అమెరికన్లను ఆదుకునేందుకు గాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది.

Also Read:డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు తిరిగిరావు: ట్రంప్ పై బిల్ గేట్స్ ఫైర్

దాని ప్రకారం..  75 వేల డాలర్ల లోపు ఆదాయం ఉన్న వారందరి ఖాతాల్లో 1,200 డాలర్లు (భారత కరెన్సీలో రూ.93 వేలు), చొప్పున జమ కానున్నాయి. 1.5 లక్షల డాలర్లలోపు ఆదాయం ఉన్న దంపతులకు 2,400 డాలర్లు ( భారత కరెన్సీలో 1.86 లక్షలు) పిల్లలకు ఒక్కొక్కరికి 500 డాలర్ల వంతున ఇవ్వనున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios