డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు తిరిగిరావు: ట్రంప్ పై బిల్ గేట్స్ ఫైర్

ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆర్ధిక అభివృద్ధిపైన్నే ట్రంప్ తన దృష్టిని కేంద్రీకరించడం పై ప్రపంచ మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత, అపార కుబేరుడు బిల్ గేట్స్ కూడా చేరిపోయారు.

Coronavirus: Bill Gates Fire on Trump over his insensitive attitude towards lives of people

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళించి వేస్తున్న వేళ అమెరికా దేశం ఆ కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆర్ధిక అభివృద్ధిపైన్నే ట్రంప్ తన దృష్టిని కేంద్రీకరించడం పై ప్రపంచ మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత, అపార కుబేరుడు బిల్ గేట్స్ కూడా చేరిపోయారు. ఆర్ధిక వృద్ధిలో వెనకబడితే మళ్ళీ పురోగమించొచ్చు, కానీ మనుషుల ప్రాణాలు కోల్పోతే... తిరిగి తీసుకురాలేము అంటూ ఆయన తీవ్రంగా ట్రంప్ విధానాలను దుయ్యబట్టారు. 

తాను గనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడిగా ఉంటే... దేశనాన్నంతటిని ఐసొలేషన్ లో ఉంచి కరోనా కేసులు తగ్గేలా చూసేవాడినని, ఇప్పుడు అమెరికాకు అదే  ఆయన అన్నాడు. అంతే తప్ప ఆర్ధిక విషయాలపైన్నే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం మంచిది కాదని ఆయన అన్నాడు. 

అంతాబాగానే ఉందని ఉద్యోగాలికెళ్ళండి, గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలను చూసుకుంటూ హోటళ్లకు వెళ్లి తినండంటే... ఎవరు వెళ్తారు. అందరూ భయంగా ఇంట్లోనే ఉంటారు అని ఆయన అన్నారు. ఇలా అమెరికా దయనీయ పరిస్థితిపై బిల్ గేట్స్ చలించిపోయారు. 

Alos Read కరోనాపై ఇటలీ చేతులెత్తేసిన వేళ... సొల్యూషన్ చెప్పిన ఇజ్రాయెల్...

ట్రంప్ ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈస్టర్ నాటికి అమెరికా తెరుచుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. రోగం కన్నా దానికి వేసే మందు మరింత బాధాకరంగా ఉండకూడదు కదా అని ట్రంప్ అన్నాడు. 

ఇకపోతే అమెరికాలో ఈ వైరస్ విజృంభిస్తుంది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే 40 నుంచి 80 శాతం మంది ఈ వైరస్ బారినపడ్డట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇకపోతే నిన్న ఒక్కరోజే అక్కడ పదివేల కేసులు నమోదయ్యాయి. 

కరోనా మహమ్మారి అమెరికాలో రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఆదివారం ప్రతి ముగ్గురు అమెరికన్ లలో ఒకరు ఇంటికే పరిమితమయ్యారు. అయినప్పటికీ.. 24గంటల్లో దాదాపు 100మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

Also Read మెడికల్ మిరాకిల్: కరోనాను జయించిన 103 ఏండ్ల భామ!..

ఈమేరకు జాన్ హాప్ కిన్స్ యూనివర్శిటీ చేసిన పరిశీలనలో తేలింది. ఇప్పటి వరకు అమెరికాలో ఈ వైరస్ కారణంగా 419మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా... బాధితుల సంఖ్య 33,546కి చేరింది. చైనా, ఇటలీ తర్వాత ఇక్కడే అధిక సంఖ్యలో వైరస్ బారినపడిన వారు ఉండటం గమనార్హం.

మరోవైపు వైరస్ కట్టడికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తగిన చర్యలు తీసుకకుంటున్నాడు. వైద్య పరికరాల కొరత తీవ్రంగా ఉందని ఆయా రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమౌతున్న తరుణంలో భారతీయ వైద్యులు మాత్రం ట్రంప్ కి మద్దతుగా నిలిచారు.

కాగా... ఇటీవల ఈ కరోనా వైరస్ ని చైనీస్ వైరస్ అంటూ మండిపడ్డ ట్రంప్.. మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్ పై చైనా తమతో సరైన సమయంలో సమాచారాన్ని పంచుకోలేదని ఆరోపించారు. తొలి రోజుల్లోనే ఈ వైరస్ కి సంబంధించిన అన్ని వివరాలు అందించి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. చైనా వ్యవహరించిన తీరు నిరాశకు గురిచేసిందన్న ట్రంప్.. తాను మాత్రం నిజాయితీగానే వ్యవహరిస్తానని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios