కరోనా వైరస్ పై అమెరికా శాస్త్ర వేత్త షాకింగ్ కామెంట్స్
శీతాకాలంలో కరోనా మరింత త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. దీనికి అత్యవసరంగా వ్యాక్సిన్ కనుగోనాల్సి ఉందన్నారు.పలు దేశాల్లో వచ్చేది శీతాకాలం కాబట్టి ప్రభుత్వాలు అప్రమత్తమవ్వాలని హెచ్చరించారు.
వాతావరణంలో మార్పులకు అనుగుణంగా కొత్త కరోనావైరస్ తిరిగి రావడానికి బలమైన అవకాశం ఉందని యుఎస్ సీనియర్ శాస్త్రవేత్త ఆంథోనీ ఫాసీ పేర్కొన్నారు. బుధవారం ఆయన కరోనా వైరస్ గురించి మాట్లాడారు. ఈ వైరస్ కి చాలా తొందరగా మందు కనుగోనాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చలికాలం వస్తే.. ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు హెచ్చరు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వద్ద అంటు వ్యాధులపై పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న ఆంథోనీ ఫౌసీ ఈ విషయంపై పలు హెచ్చరికలు జారీ చేశారు. శీతాకాలంలో కరోనా మరింత త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు. దీనికి అత్యవసరంగా వ్యాక్సిన్ కనుగోనాల్సి ఉందన్నారు.పలు దేశాల్లో వచ్చేది శీతాకాలం కాబట్టి ప్రభుత్వాలు అప్రమత్తమవ్వాలని హెచ్చరించారు.
Also Read డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు తిరిగిరావు: ట్రంప్ పై బిల్ గేట్స్ ఫైర్...
ఇదిలా ఉండగా...ఎండలు పెరిగే కొద్దీ కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని అమెరికాలోని మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) రీసెర్చర్లు తెలిపారు. జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ సేకరించిన డేటా ఆధారంగా MIT ఈ అంచనాకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 13 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉన్న దేశాల్లో వేగంగా వ్యాపించిందని పైంటిస్టులు గుర్తించారు.
అయితే కనీసం 18 డిగ్రీలపైన టెంపరేచర్ ఉన్న దేశాల్లో గడ్డకట్టే చలి ఉన్న దేశాలతో పోలిస్తే 5 శాతం తక్కువ కరోనా కేసులు నమోదైనట్లు వారు తెలిపారు. అమెరికాలోనూ ప్రస్తుతం అత్యంత చలిగా ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్ రాష్ట్రాలతో పోలిస్తే, ఫ్లోరిడా, టెక్సాస్, అరిజోనా లాంటి చోట్ల ఈ వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని వారి పరిశీలనలో తేలింది.
అమెరికాలో మార్చి 19 నుంచి వసంత రుతువు మొదలలైంది. దీంతో అక్కడ ఎండలు పెరుగుతాయని, వైరస్ వ్యాప్తి కొంతమేర కంట్రోల్ లోకి వస్తుందని MIT శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గతంలో వచ్చిన సార్స్ (కరోనా ఫ్యామిలీ) వైరస్ కూడా ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ కంట్రోల్ లోకి వచ్చిందని వారు చెబుతున్నారు.
స్పెయిన్, ఫిన్లాండ్, చైనాల్లో జరిగిన మరికొన్ని అధ్యయనాల్లోనూ ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి వేగం తక్కువగా ఉందని తేలింది. అయితే ఈ రీసెర్చ్ లలో ఎక్కువ భాగం కేసుల సంఖ్యపై ఆధారపడి చేసినవి కాబట్టి పూర్తిస్థాయిలో కేవలం ఎండ కారణంగానే కరోనా వ్యాప్తి తగ్గిందని భావించడానికి లేదని, ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకున్న చర్యలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఎండ తీవ్రత పెరిగితే వైరస్ మనల్ని ఏమీ చేయలేదన్న భ్రమలో ఉండకుండా సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా కరోనాకి అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు.