టెన్త్ పరీక్షలకే మొగ్గు: తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ నివేదిక

పదో తరగతి పరీక్షల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు నివేదిక సమర్పించింది.

Telangana government submits report to High court over ssc exams


హైదరాబాద్:పదో తరగతి పరీక్షల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు నివేదిక సమర్పించింది.

ఈ నెల మొదటి వారంలో టెన్త్ పరీక్షలు నిర్వహించుకోవచ్చని గత నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3వ తేదీన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

also read:గుడ్‌న్యూస్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఈ ఆదేశాల మేరకు హైకోర్టుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నివేదికను ఇచ్చింది.ఈ నెల 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు పదో తరగతి పరీక్షల నిర్వహించనున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. 

Telangana government submits report to High court over ssc exams

ఈ ఏడాది మే 22వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కరోనా కేసుల విషయమై రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకొంటామని హైకోర్టు ప్రకటించింది.

also read:గుడ్‌న్యూస్: జూన్ 8 నుండి జూలై 5 వరకు తెలంగాణలో టెన్త్ పరీక్షలు

కంటైన్మెంట్ జోన్లలో పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకొన్న జాగ్రత్తల విషయాన్ని కూడ హైకోర్టుకు ఇవాళ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా గతంలో ఉన్న పరీక్షా కేంద్రాల కంటే అదనంగా పరీక్షా కేంద్రాలను పెంచారు.  సుమారు 4 వేలకు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ వద్ద కూడ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios