తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు మంగళవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటి వారంలో పదోతరగతి తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయమై ఈ నెల 15వ తేదీన ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. 

జూన్ మొదటివారంలో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై జూన్ 3వ తేదీన సమీక్ష నిర్వహించి నాలుగో తేదిన నివేదిక ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఆ సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉంటే పరీక్షల నిర్వహణ విషయమై నిర్ణయం తీసుకొంటామని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయమై ఇటీవల కాలంలో ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. 

జూన్ మొదటివారంలో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసుల విషయమై జూన్ 3వ తేదీన సమీక్ష నిర్వహించి నాలుగో తేదిన నివేదిక ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఆ సమయంలో రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉంటే పరీక్షలు నిర్వహించొద్దని ఆదేశించింది.

ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తూ ఈ ఏడాది మార్చి 20వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 21వ తేదీన పరీక్షను యధాతథంగా నిర్వహించాలని కోరింది. అంతేకాదు మార్చి 23 నుండి మార్చి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. 

ఈ నెల 5వ తేదీన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం చర్చించింది. పరీక్షల నిర్వహణ కోసం అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. జూన్ మొదటి వారంలో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల విరామం ఉండాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.జూన్ 8వ తేదీ తర్వాత టెన్త్ పరీక్షలు నిర్వహించే చాన్స్ ఉంది.