జూన్ 8వ తేదీ నుండి జూలై 5 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.జూన్ మొదటివారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశించిందిన విషయం తెలిసిందే.

also read:గుడ్‌న్యూస్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

జూన్ 8 ఇంగ్లీష్ పేపర్ -1,జూన్11న ఇంగ్లీష్ పేపర్ -2 , జూన్ 14న గణితం పేపర్-1, 17న, గణితం పేపర్-2,జూన్ 20న సైన్స్ పేపర్-1, జూన్ 23న సైన్స్ పేపర్ -2, జూన్ 26న సోషల్ స్టడీసీ పేపర్-1, 29న సోషల్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. 

దగ్గు, జలుబు, జ్వరం ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.విద్యార్థులు మాస్కులతో పరీక్షలు హాజరు కావాలని ప్రభుత్వం సూచించింది.

జూన్ మొదటి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 3వ తేదీన కరోనాపై  సమీక్ష నిర్వహించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 4వ తేదీన పదో తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకొంటామని హైకోర్టు తెలిపింది.

తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ నెల 5వ తేదీన కేబినెట్ చర్చించింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన ప్రభుత్వం హైకోర్టులో అనుమతి కోరింది.

ఈ పిటిషన్ పై ఈ నెల 19వ తేదీన టెన్త్ పరీక్షలకు అనుమతి ఇచ్చింది.హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పదో తగరతి షెడ్యూల్ ను విడుదల చేసింది ప్రభుత్వం.