కలకలం: స్విమ్స్ వైద్యులతో కరోనా పాజిటివ్ లక్షణాలున్న డాక్టర్ దంపతుల భేటీ

హైద్రాబాద్ లో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న ఇద్దరు డాక్టర్లు తిరుపతిలో స్విమ్స్ డాక్టర్లను కలిసినట్టుగా అధికారులు గుర్తించారు. స్విమ్స్ డాక్టర్ల నుండి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపారు.
 

yderabad doctor couple met svims doctors on march 18


తిరుపతి:హైద్రాబాద్ లో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న ఇద్దరు డాక్టర్లు తిరుపతిలో స్విమ్స్ డాక్టర్లను కలిసినట్టుగా అధికారులు గుర్తించారు. స్విమ్స్ డాక్టర్ల నుండి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపారు.

Also read:కరోనా భయం: రాజమండ్రిలో దంపతుల ఆత్మహత్య, సూసైడ్ నోట్

హైద్రాబాద్ దోమలగూడలో ఇద్దరు డాక్టర్లకు  కరోనా  పాజిటివ్ లక్షణాలు వచ్చినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఈ నెల 26వ తేదీన ప్రకటించింది. అయితే భార్యాభర్తలైన ఈ ఇద్దరు డాక్టర్లు ఈ నెల 18వ తేదీన స్విమ్స్ లో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్లను కలిసినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని తిరుపతిలోని స్విమ్స్  అధికారులకు సమాచారం ఇచ్చారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖాధికారులు.

ప్రైవేట్ విమానంలో  తిరుపతికి వెళ్లిన  ఈ ఇద్దరు ప్రైవేట్ డాక్టర్లు  సుమారు అరగంటకు పైగా స్విమ్స్ లోని ఇద్దరు డాక్టర్లతో భేటీ అయినట్టుగా స్విమ్స్ అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరు డాక్టర్ల నుండి స్విమ్స్ వైద్యులు శాంపిల్స్ సేకరించారు. 

ఈ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపారు. ఇవాళ సాయంత్రానికి రిపోర్టు వచ్చే అవకాశం ఉందని వైద్యులు ప్రకటించారు.హైద్రాబాద్ లో పనిచేసే డాక్టర్లకు స్విమ్స్ లో పనిచేసే డాక్టర్లు స్నేహితులుగా అధికారులు గుర్తించారు.  

దోమలగూడకు చెందిన డాక్టర్లు ఇటీవల కాలంలో ఎవరెవరిని కలిశారు. ఎక్కడెక్కడికి వెళ్లారనే విషయమై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా వారి ఆరోగ్య పరిస్థితులను వాకబు చేయనున్నారు. అంతేకాదు వారి శాంపిల్స్ కూడ సేకరించి ల్యాబ్ కు పంపనున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45కు  చేరుకొంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios