తిరుపతి రుయా, స్విమ్స్ మధ్య సమన్వయలోపం: అంబులెన్స్‌లోనే ఆరుగురు కరోనా రోగులు
చిత్తూరు జిల్లాలో రుయా, స్విమ్స్ వైద్యుల మధ్య సమన్వయలోపం కారణంగా ఆరుగురు కరోనా రోగులు అంబులెన్స్ లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ విషయం కలెక్టర్ దృష్టికి వచ్చింది.అయితే ఈ ఆరుగురిని ఏ ఆసుపత్రిలో చేర్చాలనే విషయమై అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు.
తిరుపతి: చిత్తూరు జిల్లాలో రుయా, స్విమ్స్ వైద్యుల మధ్య సమన్వయలోపం కారణంగా ఆరుగురు కరోనా రోగులు అంబులెన్స్ లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ విషయం కలెక్టర్ దృష్టికి వచ్చింది.అయితే ఈ ఆరుగురిని ఏ ఆసుపత్రిలో చేర్చాలనే విషయమై అధికారులు తర్జన భర్జనలు పడుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ఆదివారం నాడు ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17కి చేరుకొన్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో 10 మంది రోగులకు మాత్రమే చికిత్స అందించే అవకాశం ఉందని ఆ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.
జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగింది. దీంతో రెండు అంబులెన్స్ లో ఆరుగురు కరోనా పాజిటివ్ రోగులను రుయా వైద్యులు స్విమ్స్ ఆసుపత్రికి పంపించారు.
అయితే స్విమ్స్ వైద్యులు ఈ రోగులను తమ ఆసుపత్రిలోకి తీసుకెళ్లేందుకు నిరాకరించారు. రుయా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో 10 బెడ్స్ మాత్రమే ఉన్నందున స్విమ్స్ ఆసుపత్రికి పంపినట్టుగా రుయా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
also read:ఏపీపై కరోనా పంజా: 12 గంటల్లో 34 కొత్త కేసులు, 226కి చేరిన మొత్తం కేసులు
స్విమ్స్ వైద్యులు మాత్రం ఈ రోగులకు ఆసుపత్రిలోకి తీసుకొనేందుకు నిరాకరించారు. దీంతో రెండు అంబులెన్స్ లు స్విమ్స్ ఆసుపత్రి బయటే నిలిచి ఉన్నాయి. ఒక్క అంబులెన్స్ లో నలుగురు పురుషులు, మరో అంబులెన్స్ లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సుమారు గంటకు పైగా అంబులెన్స్ లు స్విమ్స్ ఆసుపత్రి బయటే నిలిచిపోయి ఉన్నాయి.
ఈ పరిస్థితిని స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఆరుగురిని ఏ ఆసుపత్రిలో చేర్చాలనే విషయమై జిల్లా యంత్రాంగం సమాలోచనలు చేస్తోంది.