ఏపీపై కరోనా పంజా: 12 గంటల్లో 34 కొత్త కేసులు, 226కి చేరిన మొత్తం కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. 12 గంటల్లోనే 34 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కి చేరుకొంది.
 

Andhrapradesh reports 34 more cases, total cases rises to 226


అమరావతి: ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. 12 గంటల్లోనే 34 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆదివారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 226కి చేరుకొంది.

ఏపీ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఢిల్లీ మర్కజ్ నుండి వచ్చిన వారి నుండి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జాగ్రత్తలు తీసుకొంటుంది.

also read:వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ప్రభుత్వ పెన్షన్లు పంచుతున్నారా?, ఫోటో వైరల్

12 గంటల్లో 34 కొత్త కేసులు నమోదైతే వారిటిలో ఎక్కువగా కర్నూల్ జిల్లా నుండే అత్యధికంగా ఉన్నాయి. కర్నూల్ జిల్లాలో 23 , చిత్తూరు నుండి 7, ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరులో 2 కొత్త కేసులు నమోదయ్యాయి.

శనివారం నాటికి రాష్ట్రంలో 192 కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే 12 గంటల వ్యవధిలో 34 కొత్త కేసులు నమోదు కావడంతో ఈ సంఖ్య 226కి చేరుకొన్నాయి.

ఢిల్లీలో ప్రార్ధనలకు కర్నూల్ జిల్లా నుండి సుమారు 200కి పైగా వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారి శాంపిల్స్ రిపోర్టు వచ్చిన తర్వాత  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీ రాష్ట్రంలో పెరిగింది. 

జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు
నెల్లూరు- 34
కృష్ణా- 28
కడప- 23
ప్రకాశం-23
గుంటూరు- 30
విశాఖ -15
పశ్చిమగోదావరి -15
తూర్పుగోదావరి -11
చిత్తూరు- 10
కర్నూల్ -27
అనంతపురం -3

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios