రంపచోడవరం: మాంసం వండలేదని కర్రతో కొట్టడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.

జిల్లాలోని రంపచోడవరం మండలం సిరిగిందలపాడుకు చెందిన చెందిన లక్ష్మి జగ్గంపేట మండలం మల్లిశాలలోని ఓ జీడి మామిడితోటలో పనిచేస్తోంది.
ఇదే మండలంలోని సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేష్ కూడ ఇదే తోటలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కూడ ఒకే చోట నివసిస్తున్నారు.

Also read:కరోనా ఎఫెక్ట్: ఢిల్లీ నుండి వచ్చిన వారి కోసం అధికారుల ఆరా

శనివారం నాడు రాత్రి వెంకటేష్ మద్యం తాగి వచ్చాడు. మాంసం వండలేదని లక్ష్మితో గొడవకు దిగాడు. ఈ విషయమై వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. 
కోపం ఆపుకోలేక వెంకటేష్ కర్రతో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందింది,

లక్ష్మి శరీరంపై గాయాలు ఉండడంతో అనుమానంతో కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

మాంసం వండలేదని వెంకటేష్ లక్ష్మిని కర్రతో కొట్టినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్టుగా సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

క్షణికావేశాలకే హత్యలు చేయడం చోటు చేసుకొంటున్నాయి. మాంసం వండడం లేదనే హత్యలు చోటు చేసుకొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహ ఘటనలు చోటు చేసుకొంటున్నాయి.