కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా జమ్మలమడుగులో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ  అయింది. అనతు రాజస్థాన్ కు చెందినవాడు. అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అతనితో పాటు మరో 16 మందిని కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించారు. తాజా కరోనా పాజిటివ్ కేసుతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14కు చేరుకుంది. 

శుక్రవారంనాడు ఏపీలో 13 కరోనా కేసులు బయటపడ్డాయి. కొత్తగా విశాఖ, గుంటూరు నగరాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారంనాడు తెలిపింది. బర్మింగ్ హామ్ నుంచి ఈ నెల 17వ తేదీన వచ్చిన వ్యక్తి విశాఖ ఆస్పత్రిలో చేరాడు. మరోవైపు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Also Read: కరోనా లాక్ డౌన్: కన్న కొడుకు శవాన్ని కని, పెంచిన చేతులపైన్నే మోసుకెళ్లి..

ఇదిలావుంటే, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులను ఇంచార్జీలుగా నియమించింది. ఏపీ ఇంచార్జీగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నియమితులయ్యారు. తెలంగాణ ఇంచార్జీగా జి. కిషన్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని వారిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి రోజూ వాళ్లు కేంద్రానికి నివేదికలు సమర్పిస్తారు.

కోవిడ్ 19 వ్యాప్తి కట్టడి బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ అధికారులకు అప్పగించింది. జిల్లాకో ఐఎఎస్ అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఆయా జిల్లాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. 

ఏ జిల్లాకు ఏ ఐఎఎస్ అధికారి..... 

శ్రీకాకుళం - ఎంఎం నాయక్
విజయనగరం - వివేక్ యాదవ్
విశాఖ - కాటంనేని భాస్కర్
తూర్పు గోదావరి - బి.రాజశేఖర్
పశ్చిమగోదావరి - ప్రవీణ్ కుమార్
కృష్ణా - సిద్దార్థ్ జైన్
గుంటూరు - కాంతిలాల్ దండే
ప్రకాశం - ఉదయ లక్ష్మి
నెల్లూరు - బి.శ్రీధర్
కర్నూలు - పీయూష్ కుమార్
కడప - శశిభూషన్ కుమార్
అనంతపురం - భాస్కరరావు నాయుడు
చిత్తూరు - రాంగోపాల్