కరోనా లాక్ డౌన్: కన్న కొడుకు శవాన్ని కని, పెంచిన చేతులపైన్నే మోసుకెళ్లి...

సామాన్య పేదలకు ఈ లాక్ డౌన్ ఒక జీవన్మరణ సమస్యగా మారింది. తాజాగా అనంతపురం జిల్లా గోరంట్లో లాక్ డౌన్ వల్ల ఒక తండ్రి తన పసి గుడ్డిని చేతులపై తీసుకెళ్లి ఖననం చేసాడు. ఈ హృదయ విదారకమైన ఘటనను తలుచుకుంటే.... పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు అని అనుకోకుండా ఉండలేము. 

Corona Lockdown: Child Dies due to ill health and father carries the dead body and buries

కరోనా మహమ్మారి విలయతాండవానికి అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన లాక్ డౌన్ ప్రజల శ్రేయస్సు కోసమే అయినప్పటికీ.... ఈ లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. 

సామాన్య పేదలకు ఈ లాక్ డౌన్ ఒక జీవన్మరణ సమస్యగా మారింది. తాజాగా అనంతపురం జిల్లా గోరంట్లో లాక్ డౌన్ వల్ల ఒక తండ్రి తన పసి గుడ్డిని చేతులపై తీసుకెళ్లి ఖననం చేసాడు. ఈ హృదయ విదారకమైన ఘటనను తలుచుకుంటే.... పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు అని అనుకోకుండా ఉండలేము. 

వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా గోరంట్లలో మంచాల మనోహర్ అనే వ్యక్తి 5 సంవత్సరాలుగా నివాసముంటున్నాడు. వాస్తవంగా కదిరి పట్టాన కాపురస్థుడయినా ఇతగాడు బ్రతుకుదెరువు కోసం గోరంట్లలో ఒక పాత ఇనుము దుకాణంలో హమాలీగా పనిచేస్తున్నాడు. 

Also Read:చికెన్, గుడ్లు తింటే కరోనా వైరస్ ను ఎదుర్కోవచ్చు: కేసీఆర్

గోరంట్ల బస్టాండ్ సమీపంలో గుడారం వేసుకొని వీరి కుటుంబం జీవనం సాగిస్తోంది. మనోహర్ కు భార్య రమణమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పది రోజుల కింద పెద్ద కొడుకు దేవా దగ్గు, జ్వరం తో బాధపడుతూ... గొంతు కింద గడ్డలు కూడా రావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. 

గోరంట్ల నుండి మెరుగైన వైద్యం నిమిత్తం హిందూపురానికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి ముక్కు, నోటి నుండి రక్తం వస్తుండడంతో కర్నూల్ లేదా బెంగళూరుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. 

అంత స్థోమత లేక, ఎవరిని అడుగుదామంటే బయట ఎటువంటి రవాణా సదుపాయాలు లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో, లాక్ డౌన్ వల్ల బయట పని కూడా లేకపోవడంతో అక్కడే చికిత్స చేయించాడు. తనని తాను నిందించుకుంటూ బుధవారం రాత్రి కండ్ల ముందే కొడుకు మరణాన్ని చూసాడు. 

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. అప్పటికే తన స్థోమతకు మించి అప్పు చేసి 6వేల రూపాయలు పెట్టాడు. అక్కడి నుండి 1700 రూపాయలు చెల్లించి హిందూపురం నుంచి గోరంట్లకు ప్రైవేట్ అంబులంకలో కొడుకు మృతదేహాన్ని తరలించాడు. 

ఇక చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో గోరంట్లలోని తన గుడారం నుండి కొడుకు శవాన్ని చేతుల మీద వేసుకొని నడుచుకుంటూ వెళ్లి చిత్రావతి నది ఒడ్డున ఖననం చేసాడు. ఈ హృదయ విదారకమైన ఘటనతో గోరంట్ల గ్రామం అంతా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios