మంచి ఫుడ్ పెడతారా... పారిపోవాలా..? కరోనా రోగుల బెదిరింపులు
ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.నాణ్యమైన భోజనం పెట్టాలనీ, లేకుంటే ఇక్కడి నుంచి పారిపోతామని ధర్మవరంలో క్వారంటైన్‌లో ఉన్నవారు సోమవారం ఆందోళనకు దిగారు.
మంచి ఆహారం తమకు పెట్టకుంటే.. క్వారంటైన్ నుంచి పారిపోతామంటూ కరోనా రోగులు బెదిరిస్తున్నారు. మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ లో బీడీలు కావాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా నగ్నంగా ఐసోలేషన్ వార్డుల్లో తిరుగుతూ.. మహిళా నర్సులను వేధించారు.
Also Read ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి: కొత్తగా ఒక్క కేసు నమోదు, మృతులు నలుగురు...
ఇక రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో కరోనా రోగులు సైతం చికెన్ బిర్యానీ కావాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.నాణ్యమైన భోజనం పెట్టాలనీ, లేకుంటే ఇక్కడి నుంచి పారిపోతామని ధర్మవరంలో క్వారంటైన్‌లో ఉన్నవారు సోమవారం ఆందోళనకు దిగారు.
ఇటీవల ఢిల్లీలోని జకాత్‌కు వెళ్లివచ్చిన 15 మందికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానంతో పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు 5 రోజుల క్రితం తరలించారు. నాసిరకం భోజనం పెడుతున్నారనీ, తినలేక ఇబ్బందులు పడుతున్నామ ని వారు పేర్కొన్నారు.
పస్తులైనా ఉంటాం కానీ, భోజనం చేసేది లేదంటూ భీష్మించారు. ఆర్డీఓ మధుసూదన్ దాతలకు ఫోన్ చేసి, నాణ్యమైన బియ్యంతో ఆహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఏపీలో 304 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.