లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా ప్రజలను కట్టడి చేస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కోవిడ్ 19 కేసుల సంఖ్య 21 కి చేరింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజే ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారంనాడు ఏపీలో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరుకుంది. గుంటూరు జిల్లాలో రెండు ప్రకాశం జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి.

Also Read:కరోనా దెబ్బ:విదేశాల నుండి వచ్చిన భర్త, దాచిన భార్య ఉద్యోగానికి ఎసరు

కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ శనివారం రాత్రి విడుదల చేసిన బులిటెన్ లో తెలిపింది. 74 మందికి పరీక్షలు నిర్వహించగా 68 మందికి నెగెటివ్ వచ్చినట్లు తేలింది. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దంపతులు ఈ నెల 13వ తేదీన చీరాల నుంచి ఒంగోలు మీదుగా ఢిల్లీకి రైల్లో వెళ్లి , అక్కడ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

తిరిగి రైలులో విజయవాడకు వచ్చి, ఈ నెల 18వ తేదీన జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ ద్వారా ఒంగోలుకు వెళ్లారు. మర్నాడు 19వ తేదీన ఒంగోలు నుంచి ప్యాసింజర్ రైలు ద్వారా చీరాలకు చేరుకున్నారు. ఈ నెల 26వ తేదీన అనుమానిత లక్షణాలు కనిపించడంతో వారిద్దరినీ అంబులెన్స్ లో తీసుకుని వెళ్లి ఒంగోలు బోధనాస్పత్రిలో చేర్చారు. వారిద్దరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

Also Read:పరీక్షలు చేయించుకుంటేనే కాపురానికి రా: భర్తకు భార్య కరోనా వార్నింగ్

గుంటూరు జిల్లాలో అప్పటికే కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి ద్వారా మరో ఇద్దరికి సంక్రమించింది. విజయవాడకు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ఈ నెల 9వ తేదీన మక్కా నుంచి విమానంలో హైదరాబాదుకు, అక్కడి నుంచి బస్సులో విజయవాడకు వచ్చాడు. ఈ నెల 27వ తేదీన విజయవాడలోని జీజీహెచ్ లో చేరారు. అతని కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 

కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏల్ల యువకుడు ఈ నెల 18వ తేదీన రాజస్థాన్ నుంచి సికింద్రాబాదుకు, అక్కడి నుంచి రైలులో 19వ తేదీన కర్నూలుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి బస్సులో నోస్సంకు చేరుకున్నాడు.

అక్కడి నుంచి రైలులో కడపకు చేరుకుని 2 బస్సుల్లో ప్రొద్దుటూరు, జమ్మలమడుగులకు వెళ్లాడు.  ఈ నెల 24వ తేదీన అనుమానిత లక్షణాలతో జీజీహెచ్ లో చేరాడు. అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.