అమరావతి: ఏకగ్రీవాలు శృతిమించితే అధికారుల వైఫల్యం కిందకు వస్తోందని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చెప్పారు.

నెల్లూరు జిల్లాలో అధికారులతో ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం నాడు నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.నాయకత్వ బాధ్యతల కోసం పోటీ పడడం శుభపరిణామంగా ఆయన చెప్పారు. ఏకగ్రీవాలు ఎక్కువైతే అధికారుల వైఫల్యం కిందే వస్తోందన్నారు. 

also read:ఈ-వాచ్ యాప్‌పై జగన్ సర్కార్ పిటిషన్: విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు

ఎన్నికల వల్ల గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్గుతోందనే వాదనతో తాను ఏకీభవించడం లేదన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక మళ్లీ అందరూ కలిసే ఉంటారన్నారు.

గతంలో నెల్లూరు జిల్లాలో 85 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఈ సారి అంంతకంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని ఆయన కోరారు. 

గ్రామాభివృద్దిలో సర్పంచ్ లదే కీలక పాత్ర అని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ఎన్నికల సమయంలో పొరపాట్లను ఈ దఫా పునరావృతం కాకుండా చూడాలని  ఆయన అధికారులను కోరారు.