ఏపీ కేబినెట్: 3 నెలల బడ్జెట్‌పై ఆర్డినెన్స్ కు గ్రీన్ సిగ్నల్, కరోనాపై కేబినెట్ సబ్ కమిటి

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  ఐదుగురు మంత్రులతో ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటిని ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ కేబినెట్ సబ్ కమిటి వైద్య ఆరోగ్యశాఖాధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకొంటుంది. 

Ap government appoints cabinet sub committee on corona

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు  ఐదుగురు మంత్రులతో ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటిని ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ కేబినెట్ సబ్ కమిటి వైద్య ఆరోగ్యశాఖాధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకొంటుంది. వచ్చే మూడు మాసాల కోసం బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also read:కరోనా ఎఫెక్ట్: 3 నెలల బడ్జెట్‌కు ఆర్డినెన్స్, 27న ఏపీ కేబినెట్

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం శుక్రవారం నాడు ఉదయం  అమరావతిలో జరిగింది.సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. కరోనా వ్యాప్తి నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేబినెట్ సభ్యులకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు వివరించారు. 

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా ఆళ్లనాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత,కన్నబాబులతో ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటిని ఏర్పాటు చేసింది. ప్రతి రోజూ  వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఈ కమిటితో సమావేశమై కరోనా గురించిన సమచారాన్ని అందిస్తారు. రాష్ట్రంలో ఉన్న  పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేబినెట్ సబ్ కమిటి వైద్య ఆరోగ్య శాఖకు సూచనలు చేయనుంది.

అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే పరిస్థితులు లేనందున వచ్చే మూడు మాసాల పాటు బడ్జెట్ వినియోగం కోసం ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు.

ఈ మాసంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ఈ నెలలో నిర్వహించే అవకాశాలు లేవు. దీంతో ఆర్డినెన్స్ ద్వారా మూడు మాసాలకు బడ్జెట్ కు ఆమోదం తెచ్చుకొనే అవకాశం ఉంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios