అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87 కు చేరుకొంది. కేవలం 12 గంటల్లోనే 43 కరోనా పాజిటివ్ కేసులు  నమోదైనట్టుగా రిపోర్టులు తెలుపుతున్నాయి.  ఢిల్లీలో మత ప్రార్థనల కోసం వచ్చినవారి నుండే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

also read:ఏపీపై కరోనా పంజా: ఒక్క రోజే 17 పాజిటివ్ కేసులు, మొత్తం 40కి చేరిక

బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ లో కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి.373 శాంపిళ్లను ల్యాబ్ కు పంపారు. వీటిలో 43 పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ప్రకాశం జిల్లాలో కూడ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వ్యక్తి కొడుకుకు కూడ కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చినట్టుగా  వైద్యులు  ప్రకటించారు.

రెండు రోజులుగా ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారి నుండే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిందనే అభిప్రాయంతో అధికార వర్గాలు ఉన్నాయి.

మార్చి 31వ తేది రాత్రి 9 గంటల నుండి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 

ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నిజాముద్దీన్ ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారంతా స్వచ్ఛంధంగా వైద్య పరీక్షలు చేసుకోవాలని ప్రభుత్వం బుధవారం నాడు కోరింది. మరో వైపు ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన వారితో పాటు వారి బంధువులు, కుటుంబసభ్యులకు కూడ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది.


ఏపీలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

చిత్తూరు-5
తూర్పుగోదావరి జిల్లా-2
కృష్ణా-1
నెల్లూరు-2
ప్రకాశం-4
విశాఖపట్టణం-1
కడప-15
నెల్లూరు-2
పశ్చిమగోదావరి జిల్లా-13

 

జిల్లా        ఇప్పటివరకు నమోదైన కేసులు    కోలుకొన్న వారి సంఖ్య

అనంతపురం             2                                   లేవు
చిత్తూరు                      6                                   లేవు
తూర్పుగోదావరి          6                                   లేవు
గుంటూరు                   9                                    లేవు
కడప                           15                                   లేవు
కృష్ణా                           06                                   లేవు
కర్నూల్                      01                                   లేవు
నెల్లూరు                    03                                      01
ప్రకాశం                       15                                     లేవు
విశాఖపట్టణం            11                                     01
పశ్చిమగోదావరి          13                                       లేవు