Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ప్రభుత్వ పెన్షన్లు పంచుతున్నారా?, ఫోటో వైరల్

పెద్దలకందించే పెన్షన్లను గ్రామ వాలంటీర్లు అందివ్వకుండా, వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులతో ఇప్పిస్తున్నారు, ఇది నేరమని, చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషనర్ ను టీడీపీ కోరింది. 

TDP demands to take action against YCP corporator Candidates distributing Government pensions, Tweets Photo
Author
Vijayawada, First Published Apr 5, 2020, 7:00 AM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే పనిలో దేశమంతా బిజీగా ఉంటే... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ కరోనా వేళ కూడా రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉన్నాయి. 

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడి..... ఈ కరోనా లాక్ డౌన్ ముగియగానే జరగనున్న నేపథ్యంలో వాటి తాలూకు వాడి, వేడి ప్రస్పుతంగా కనబడుతుంది. తాజాగా విజయవాడ టీడీపీ మాజీ కార్పొరేటర్ రామయ్య వైసీపీ పై ఆరోపణలు చేస్తూ ట్విట్టర్లో అందుకు సంబంధించిన ఫోటో ఒకటి పెట్టారు, 

ఆ తరువాత ఆ ట్వీట్ కి విజయవాడ ఎంపీ కేశినేని నాని రిప్లై ఇస్తూ ఎన్నికల కమిషన్ ని విజయవాడ మునిసిపల్ కమీషనర్ ని చర్యలు తీసుకోవాలిసిందిగా కోరారు. ఇంతకీ విషయం ఏమిటంటే.... రాష్ట్రంలో పేదలకందరికీ రకరకాల సంక్షేమ పథకాల రూపంలో, పెన్షన్ల రూపంలో ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.  

ఆ డబ్బులను సాధారణంగా గ్రామా వాలంటీర్లు పంచుతున్నారు. కాకపోతే... విజయవాడలో మాత్రం వైసీపీ తరుపున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులతో పంచిస్తున్నారని, అది నేరమని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. 

ప్రభుత్వ డబ్బును ఇలా ఎన్నికల్లో నిలబడే కార్పొరేటర్ అభ్యర్థులు పంచడం ఎన్నికల నియమావళి కిందకు వస్తుందని వారు అంటున్నారు. అంతే కాకుండా ప్రభుత్వ డబ్బును వారి చేత పంచిపెట్టియడం, ఒకరకంగా వారు ప్రభుత్వ డబ్బును వారు ఎన్నికల ముందు వారికోసం పంచిపెట్టినట్టుగా అవుతుందనేది టీడీపీ వాదన. 

బయట కరోనా ఏ లెవెల్ లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్నికల వేడి జోరు మీద ఉంది. ఇది ఇలా ఉంటె... కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దాంతో శనివారం సాయంత్రానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 192కి చేరుకుంది. కొత్తగా కృష్ణా జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఒక్కటేసి చొప్పున కేసులు నమోదయ్యాయి.

కేంద్రం భేష్... జగన్ ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రికి కళా వెంకట్రావు ఫిర్యాదు

కరోనా వైరస్ సోకి ఆంధ్రప్రదేశ్ లో మరో మరణం సంభవించింది. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి మరణించాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి మరణించినవారి సంఖ్య రెండుకు చేరుకుంది. శనివారంనాడు మరణించిన ఆ వ్యక్తిని ముస్తాక్ ఖాన్ (56)గా గుర్తించారు. విజయవాడలో ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

శనివారం ఉదయానికి ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది. కర్నూలు జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా కేంద్రం, బనగానపల్లి, అవుకుల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 190కి చేరుకుంది.

కరోనా వైరస్ పాజిటివ్ కేసులపై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 10.30 నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు కొత్తగా కృష్ణా జిల్లాలో 4, కడప జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. కొత్తగా నమోదైన ఈ 16 కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది.

నెల్లూరు జిల్లాతో కృష్ణా జిల్లా పోటీ పడుతోంది. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో 32 చొప్పున కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకైతే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వ్యాధికి గురైనవారిలో ఎక్కువ మంది ఢిల్లీలో జరిగన మతప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారే కావడం గమనార్హం. వారిని గుర్తించి, వారినీ వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ కు పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 3
చిత్తూరు 10
తూర్పు గోదావరి 11
గుంటూరు 26
కడప 23
కృష్ణా 32
కర్నూలు 4
నెల్లూరు 32
ప్రకాశం 19
విశాకపట్నం 15
పశ్చిమ గోదావరి 15

Follow Us:
Download App:
  • android
  • ios