AP CORONA UPDATES: ఏపీ క‌రోనా అప్డేట్స్ .. కొత్త కేసులేన్నంటే..?

ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య రోజు పెరుగుతూ.. మ‌రో రోజు త‌గ్గుతూ క‌ల‌వ‌ర పెట్టిస్తుంది. గడిచిన 24 గంటల్లో 193 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మ‌రో వైపు ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళ‌న కు గురి చేస్తోంది. 
 

Andhra Pradesh reports 193 fresh Covid cases, 3 deaths

AP CORONA UPDATES: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఒకసారి పెరుగుతూ.. మరోసారి తగ్గుతూ కలవరపెడుతున్నాయి. నిన్నక‌రోనా కేసుల సంఖ్య కాస్త .. త‌గ్గ‌గా.. నేడు ఆ కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… 

గత 24 గంటల్లో ఏపీలో 31,101 మంది శాంపిల్స్ ని పరీక్షించగా 193 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు..3,06,82,613 కరోనా పరీక్షలు చేసింది ఆరోగ్యశాఖ. తాజా కేసుల‌తో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 20744410 కి చేరుకుంది. మ‌రోవైపు.. కరోనా కారణంగా.. కృష్ణ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు 14,460 మంది కరోనా కారణంగా మరణించారు. అలాగే.. గడచిన 24 గంటల్లో 164 మంది కరోనా కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 2037 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపింది. తాజాగా.. హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 మంది కరోనా బారిన పడ్డారు. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

READ ALSO: https://telugu.asianetnews.com/andhra-pradesh/omicron-tension-in-srikakulam-district-after-south-africa-returnee-tests-positive-for-covid-r3s4sk
 
మ‌రోవైపు ఏపీలో ఒమిక్రాన్ క‌ల‌వ‌ర పెడుతోంది. ఏపీలో ఒమిక్రాన్ కేసు నమోదు కావ‌డంతో రాష్ట్రం ప్యానిక్ మోడ్ లోకి వెళ్లింది. ఇటీవల లండన్ నుంచి తిరిగి శ్రీకాకుళం వ‌చ్చిన ఓ వ్య‌క్తిని కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఒమిక్రాన్ అనే అనుమానంతో అతడి శాంపిల్స్ ను హైదరాబాద్ కు పంప‌గా..  ఒమిక్రాన్ అని నిర్ధారణ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీంతో అత‌డిని శ్రీకాకుళం రిమ్స్ కు తలరించి.. చికిత్స అందిస్తున్నారు. ఏపీలో తొలి ఒమిక్రాన్ నమోదు అవ్వడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios