Asianet News TeluguAsianet News Telugu

జొమాటో కొత్త ఆఫర్.. లేటైతే పుడ్ ఫ్రీ!

ఆన్ లైన్ ఫుడ్ అగ్రిగేటర్ ‘జొమాటో’ తన వినియోగదారులకు నూతన ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్ సకాలంలో రాకపోతే డబ్బు చెల్లించనవసరం లేదని పేర్కొంది. ఇప్పటి వరకు డొమినోస్ సంస్థ ఇదే ఆఫర్ అందిస్తోంది. 

Zomato's new offer: Get free food if the delivery gets late
Author
Hyderabad, First Published Dec 18, 2019, 11:39 AM IST

న్యూఢిల్లీ: ఆన్‌‌లైన్ పుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన కస్టమర్లకు సరికొత్త ఆఫర్‌‌‌‌ను ప్రకటించింది. ‘ఆన్​టైం లేదా ఫ్రీ’  అనే కొత్త ఫీచర్‌‌‌‌ను​ అందుబాటులోకి తేనుంది. దీని ప్రకారం ఆర్డర్​ ఆన్ టైంలో రాకపోతే, కస్టమర్లు మనీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే ఆఫర్‌‌‌‌ను డోమినోస్ ఎప్పటి నుంచో ఇస్తోంది. డోమినోస్​ ‘30 నిమిషాలు లేదా ఫ్రీ’ అనే ఆఫర్‌‌‌‌ను కస్టమర్లకు అందిస్తోంది. కానీ జొమాటో స్పష్టమైన టైం ప్రకటించలేదు. 

aslo read జోమాటో చేతికి ఉబర్ ఈట్స్..! స్వీగ్గి పై డైరెక్ట్ వార్..

జొమాటో ‘ఫ్రీ పుడ్’​ పొందడానికి మీరు చేసిన క్రేజియస్ట్ పనేంటి?” అని  ట్విట్టర్‌‌‌‌లో ట్వీట్​చేసి, ఆ తర్వాత ఈ ఆఫర్‌‌‌‌ను బయట పెట్టింది.  ఈ ఫీచర్‌‌ ప్రకారం పుడ్ ​డెలివరీ ఆన్​టైంలో ఉంటుందని, లేకపోతే మనీ ఇవ్వనవసర లేదని కంపెనీ పేర్కొంది. ఈ ఫీచర్​  భారతదేశంలోని 100కు పైగా​ నగరాల్లో వేల రెస్టారెంట్ల జొమాటో మెనూకు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ ఫీచర్‌‌‌‌ను వాడాలనుకునే కస్టమర్లు ఆర్డర్ పెట్టేటప్పుడు  ‘ఆన్ టైం లేదా ఫ్రీ’ పై క్లిక్ ​చేయాల్సి ఉంటుంది. జొమాటో ఆన్‌‌టైంలో డెలివరీ చేయలేకపోతే, మనీ తిరిగి వాపస్ చేస్తామని తెలిపింది. ఆర్డర్​ ఆన్​టైం లేక  ఫ్రీ ఆర్డరా అనే విషయం డెలివరీ పార్టనర్లకు, రెస్టారెంట్లకు తెలియదని కంపెనీ పేర్కొంది. అందువల్ల డెలివరీ పార్టనర్లు టైం బ్రేక్ చేసే అవకాశం లేదని అభిప్రాయపడింది.

Zomato's new offer: Get free food if the delivery gets late

కంపెనీ ఈ ఫీచర్‌‌‌‌ను ప్రకటించక ముందే “కభీతో లేట్​హో జాతే’ అంటు టీవీ ప్రచారం ప్రారంభించింది. ఈ యాడ్‌‌ బ్యాక్‌‌గ్రౌండ్లో ‘తోడా సా లేట్​ హోజాతా’ అంటు పాట వినిపిస్తుంది. కానీ డెలివరీ బాయ్ ​ప్రతి సారి పుడ్‌‌ను ఆన్‌‌టైంలోనే డెలివరీ చేస్తారు. దక్షిణ భారతంలో విడుదల చేసిన ఈ యాడ్‌‌లో విజయ్​దేవరకొండ  జొమాటో యూజర్‌‌‌‌గా నటించారు.

also read  అమెరికాకు షాక్...విమానాల తయారీ నిలిపివేత...

ఇండియా పుడ్ డెలివరీ మార్కెట్‌‌లో మేజర్​ వాటా పొందేందుకు జొమాటో, స్విగ్గీ పోటీపడుతున్నాయి. తాజాగా ఉబర్‌‌‌‌కు చెందిన ఉబర్‌‌‌‌ ఈట్స్‌‌ను జొమాటో కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందంలో ఉబర్‌‌ ఈట్స్‌‌ విలువ రూ. 2,839 కోట్లు (400 మిలియన్​ డాలర్లు) అని తెలుస్తోంది.

దీని ప్రకారం ఉబర్​ఈట్స్, జొమాటోలో 150–200 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా మరో 600 మిలియన్‌‌ డాలర్లు నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు జొమాటో చెప్పింది. 

Follow Us:
Download App:
  • android
  • ios