ఈ ఏడాది చివరి నాటికి ఉబెర్ ఈట్  ఇండియా వ్యాపారాన్ని  జోమాటోకు విక్రయించడానికి ఉబెర్ చర్చల్లోకి ప్రవేశించినందున భారతదేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ పరిశ్రమ పెద్ద చర్చలకు దారితీసింది. సోమవారం టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, "ప్రస్తుతం ఉబెర్ ఈట్స్ ఇండియా వ్యాపారాన్ని 400 మిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది".

ఈ ఒప్పందంలో భాగంగా, "జోమాటో ఉబెర్లో $ 150 మిలియన్ల నుండి  200 మిలియన్ల వరకు పెట్టుబడిని పెట్టవచ్చు" అని నివేదికలో పేర్కొంది.ఉబెర్ ఈట్స్  2017లో భారత మార్కెట్లోకి వచ్చినప్పటికీ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలో అనుకున్నంతగా రాణించలేకపోయింది.

also read అమెరికాకు షాక్...విమానాల తయారీ నిలిపివేత... 


ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో జోమాటో వ్యవస్థాపకుడు, సిఇఒ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ  600 మిలియన్ డాలర్ల వరకు నిధులను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.జోమాటో మాత్రం "పుకార్లు లేదా ఊహాగానాలపై స్పందించేది లేదు" అని అన్నారు.


2017లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పటికి ఉబెర్ ఈట్స్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విభాగంలో అనుకున్నానంతగా ఆకట్టుకోలేదు.జోమాటో ప్రస్తుతం భారతదేశంలోని 1,50,000 రెస్టారెంట్ల నుండి రోజుకు 1.3 మిలియన్ ఆర్డర్‌లను, ఒక రెస్టారెంట్ నుండి రోజుకు  10 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు పంపిణీ చేస్తోంది.


మరో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ  స్విగ్గి తన సేవలను భారతదేశంలోని 500 నగరాలకు విస్తరించింది. గత ఆరు నెలల్లో 60,000 కొత్త రెస్టారెంట్లను జోడించిన స్విగ్గి, అక్టోబర్‌లో ఇది 2019 డిసెంబర్ నాటికి 600 నగరాలకు విస్తరిస్తుందని చెప్పారు.


ఏప్రిల్ 2019 నుండి స్విగ్గి రెస్టారెంట్ భాగస్వాములను దాదాపు 1.8 రెట్లు పెరిగి ప్రస్తుతం 1.4 లక్షల రెస్టారెంట్లకు పెంచింది. టైర్ -3, టైర్ -4 నగరాల్లో ప్రత్యేకంగా స్విగ్గి గత ఆరు నెలల్లో 15 వేలకు పైగా రెస్టారెంట్లలోకి ప్రవేశించింది.బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్  తాజా అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ మార్కెట్ ఏటా 16 శాతానికి పైగా పెరిగి 2023 నాటికి 17.02 బిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉంది.

also read  టెక్కీలకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాదిలో వారికి పండుగే!

  ఒరిస్సా లోని రెండవ నగరం కటక్‌లో ఉబెర్ ఈట్స్ గత వారం తన సర్వీసెస్ ప్రారంభించింది. మిర్చి, బిర్యానీ బాక్స్, డిఎఫ్‌సి దాదా  బిర్యానీ, బర్గర్ అడ్డా ఫ్యాక్టరీ వంటి అనేక స్థానిక రెస్టారెంట్లతో ఉబెర్ భాగస్వామి అని తెలిపింది. ఉబెర్ ఈట్స్ ఐ‌ఏ‌ఎన్‌ఎస్ తో మాట్లాడుతూ మేము భారతదేశంలో పెరుగుతున్న ఫుడ్ టెక్ పరిశ్రమలో ఉండటమే కాకుండా, తమ వినియోగదారులకు విరామం లేని డెలివరీ అనుభవం కోసం రెస్టారెంట్ భాగస్వాములతో మంచి సంబంధాలను పెంచుకుంటోంది.


"ప్రస్తుతం మేము రెస్టారెంట్ భాగస్వాములతో డెలివరీపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాము. మేము ఇండియా మార్కెట్లో చాలా నేర్చుకుంటున్నాము" అని ఉబెర్ ఈట్స్  ఆపరేషన్స్ హెడ్ బన్సి కోటేచా అన్నారు. .అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో రెండు అతిపెద్ద సంస్థలు బెంగళూరుకు చెందిన స్విగ్గి, గురుగ్రామ్ ఆధారిత జోమాటో  విలీన నివేదికలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి.అమెజాన్ దేశంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ప్రవేశిస్తుండటంతో ఈ పోటీ ఇంకా పెరగడంతో రెండు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య విలీన చర్చలు మొదలయ్యాయి.