బెంగళూరు: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సాంకేతిక రంగంలో  దాదాపు 10% నియామకాలను పెంచుతుందని రిక్రూట్‌మెంట్ నిపుణులు గుర్తించారు. టెక్ పరిశ్రమలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలలో నిరంతర వృద్ధిని వారు గుర్తించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రంగం దాదాపు 1,80,000 మందిని ఫైనాన్షియల్ ఇయర్ గాను నియమించింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2,00,000 మంది ఇంజనీర్లను, గ్రాడ్యుయేట్లను నియమించుకుంటుందని పరిశ్రమ నిపుణులు తెలిపారు" మల్టీ నేషనల్  కంపెనీ భారతదేశ బెసేడ్ టెక్నాలజి యూనిట్ సహకారంతో 1-5 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా నియామకాలలో వృద్ధి ఉంటుందని," కమల్ కరాంత్, సహ వ్యవస్థాపకుడు, ఎక్స్‌ఫెనో, బెంగళూరు సిబ్బంది ఏజెన్సీ, ఎకనమిక్స్ టైమ్స్ కి చెప్పారు.

also read నిరసనలకు తలొగ్గి...రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లింపు

ప్రస్తుత ప్రపంచ కంపెనీలు, కొత్త టెక్నాలజి సెంటర్ల ద్వారా  నియామకాలు ఉంటాయని ఆయన అన్నారు.ఎక్స్‌ఫెనో అంచనాల ప్రకారం గత 12-18 నెలల్లో దాదాపు 30 మంది  టెక్నాలజీ సేవల సంస్థలతో రీ-బ్యాడ్జింగ్ ఒప్పందాల ద్వారా భారతదేశంలో  ఏర్పాటు చేశారు.

"భారతదేశం అనేక హై స్కిల్స్ కలిగిన ప్రొఫెషనల్స్ ను అందిస్తుంది, ప్రస్తుతం ఉన్నవారిని ఇక్కడ నియమించుకోవడం వల్ల రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో ఇంకా నియమకాలు పెరుగుతూ ఉండటానికి ఇది ఒక ప్రధాన కారణం" అని భారతదేశానికి చెందిన టెక్నాలజీ సెంటర్‌లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. 

"ఈ రంగంలోని వేరే సంస్థలు కూడా చాలా మందిని నియమించుకుంటున్నారు. కొంతమందికి, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు కార్యాలయాలను స్థాపించడం వలన భారీగా నియామకాలు ఉంటాయి, ”అని అన్నారు.భారతదేశంలోని మొదటి ఐదు ఐటి సేవల సంస్థలు - టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రా 2021 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ మొత్తం నియామకాల్లో 40% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.

"మేము చాలా నమ్మకంగా ఉన్నాము, మా నియామకాలలో కొంత వృద్ధి కూడా ఉంటుంది" అని హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ అన్నారు.గత నెలలలో టాప్ ఫైవ్ సాఫ్ట్‌వేర్ సర్వీసు ప్రొవైడర్లు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 64,442 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నారు, గత ఏడాదిలోని ఇదే సమయంలో 54,642 మందిని నియమించుకున్నారు . టిసిఎస్ మాత్రమే ఈ సంవత్సరం 30,000 ఆన్-క్యాంపస్ ఆఫర్లను ఇచ్చింది.

also read రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు..2018-19లో ఆదాయం ఎంతంటే..?

పెరిగిన టెక్నాలజి, ఇంకా  డిజిటల్ రంగంలో వచ్చే ఏడాది నియామకంలో వృద్ధిని మరింత పెంచుతుందని పరిశ్రమ నిపుణులు అన్నారు.పరిశ్రమ లాబీ నాస్కామ్  చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సంగీత గుప్తా మాట్లాడుతూ, "టెక్ ఉద్యోగులు మాకు ఎక్కువ అవసరం ఉంది ప్రారంభంలో  వెనుకబడి ఉన్నప్పటికీ, 20121 సంవత్సరం మధ్యలో  మెరుగ్గా ఉంటుంది".

విప్రో  హ్యూమన్ రిసోర్సెస్ చీఫ్ హెడ్ సౌరభ్ గోవిల్ ఇటీవలి ఇచిన ఇంటర్వ్యూలో  ఎకనమిక్స్ టైమ్స్ తో మాట్లాడుతూ డిజిటల్ టెక్నాలజీలో రిస్కిల్ లేని మిడిల్ మేనేజర్లకు ఎటువంటి పెరుగుదల లేదు. "మిడిల్ మేనేజ్మెంట్ ను పునరుద్ధరించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము.

వారు డిజిటల్‌ లోకి వెళ్లడంలో విజయవంతం కాకపోతే, వారిలో కొందరు సంస్థ నుండి వెళ్లిపోవాలని లేదా జీతంలో పెరుగుదల ఇవ్వమని తెలిపాము, ”అని అన్నారు.15 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న మిడ్-టు-సీనియర్ స్థాయి ఉద్యోగులు వేగంగా మారకపోతే ప్రధాన టెక్ సర్వీసెస్ కంపెనీలలో వారి పోస్టుల్లో ఉండడం కష్టమని ఎక్స్‌ఫెనో కరాంత్ చెప్పారు.