Asianet News TeluguAsianet News Telugu

అక్షయతృతీయ: బంగారం కొనుగోలు చేసేముందు వీటిని గమనించండి

అక్షయ తృతీయ వస్తోందంటే చాలు నగల వ్యాపారులు భారీ ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. భారీ డిస్కౌంట్లు అందిస్తామంటూ పోటీ పడుతుంటారు. వినియోగదారులు జాగ్రత్తగా ఆఫర్లను గమనించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
 

Weddings, lower prices could lift Indian gold demand in June   quarter: WGC
Author
Mumbai, First Published May 2, 2019, 1:16 PM IST

అక్షయ తృతీయ వస్తోందంటే చాలు నగల వ్యాపారులు భారీ ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. భారీ డిస్కౌంట్లు అందిస్తామంటూ పోటీ పడుతుంటారు. వినియోగదారులు జాగ్రత్తగా ఆఫర్లను గమనించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అయితే, షాపుల్లోనే కాక, గోల్డ్ ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్), సావరిన్ గోల్డ్ బాండ్స్(ఎస్‌జీబీ)ల్లోనూ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు తీసుకోవచ్చు. 

షాపుల్లో కొనుగోళ్లపై ఇలా..

ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది నగల దుకాణాల్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించిన తర్వాతే వాటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆభరణాలను కొనుగోలు చేయడంలో తరుగు, మజూరి లాంటి కీలకాంశాలు. వాల్యూ ఎడిషన్(వీఏ) లేదంటే మేకింగ్ ఛార్జీలకైన ఖర్చును తలచుకునే చాలా మంది వినియోగదారులు కొనుగోళ్లపై వెనుకడగు వేస్తారు. అయితే, నగల దుకాణాలు ప్రకటించిన ఆఫర్లను ఉపయోగించుకోవడం, గోల్డ్ స్కీమ్స్‌లో పాల్గొనడం ద్వారా ప్రతినెలా కొంత మొత్తం చెల్లించి, ఆ మొత్తానికి వీఏని రాయితీని పొందే అవకాశం ఉంటుంది.

ఆభరణాలు కాకుండా కాయిన్స్ కొనుక్కునే వారిపై కూడా షాప్‌లు మేకింగ్ ఛార్జీలను వేస్తున్నాయి. ఇదంతా కాదనుకుంటే బ్యాంకుల్లోనూ నగలు కొనుగోలు చేయవచ్చు. ఎంఎంటీసీ లాంటి సంస్థలు ఈ కాయిన్స్‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్నాయి. ఇక్కడ మార్కెట్ ధరలతో పోలిస్తే కొంత తక్కువకే కొనుగోలు చేయవచ్చు.

గోల్డ్ ఎక్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్):

భౌతికంగా కాకుండా పేపర్ల మీదనే బంగారం ఉందనడానికి ఉన్న మరో అవకాశం గోల్డ్ ఈటీఎఫ్. సాధారణంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయిన పలు గోల్డ్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఉండే రిస్క్ ఇక్కడ కూడా ఉంటాయి. ఈ తరహా గోల్డ్ ఈటీఎఫ్‌లపై మూడేళ్ల తర్వాత 20శాతం పన్ను కూడా చెల్లించాల్సి రావచ్చు. 

సావరిన్ గోల్డ్ బాండ్స్ 

భారత రిజర్వు బ్యాంక్ విడుదల చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు ఇటీవల కాలంలో బాగా డిమాండ్ పెరిగింది. ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మకానికి పెట్టిన తేదీలకు ముందున్న బంగారం ధరనే బాండ్ ధరగా నిర్ణయిస్తుంటారు. అయితే, ఫిబ్రవరి 2019 వరకూ విక్రయాలను జరిపారు. కానీ, ఇప్పుడు విక్రయాలను తాత్కాలికంగా నిలిపేసినట్లు తెలుస్తోంది.

ఈ బాండ్స్‌లో ఉన్న ప్రధాన ప్రయోజనం క్యాపిటల్ గెయిన్ పన్ను మినహాయింపు కావడం గమనార్హం. అంతేగాక, ఈ బాండ్స్‌పై దాదాపు 3శాతం వరకూ వడ్డీ పొందే అవకాశం ఉండటం. ప్రభుత్వం ఈ బాండ్స్ విడుదల చేసినప్పుడు కొనుగోలు చేసుకోవడం వల్ల కొంత ప్రయోజనం పొందవచ్చు. కాగా, గత కొంతకాలంగా పడిపోతూ వచ్చిన బంగారం ధరలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఇటీవల క్రమంగా పెరుగుదల నమోదు చేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios