వాషింగ్టన్‌: ఇన్ఫోసిస్‌ మాజీ సీఈవో విశాల్‌ సిక్కా ఒరాకిల్‌ బోర్డ్‌లో డైరెక్టర్‌గా నామినేట్‌ అయ్యారు. ఆయన ఇప్పటికే కృత్రిమమేధ ఆధారంగా పనిచేసే వియనాయ్‌ అనే స్టార్టప్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. విశాల్‌ సిక్కా (52)  ప్రపంచలోనే అత్యుత్తమ కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ నిపుణుల్లో ఒకరు.

also read ఉద్యోగులకు షాక్...ఈపీఎఫ్ఓ వాటాలో కోతపై కేంద్రం నజర్?

విశాల్‌ రాకతో ఒరాకిల్‌ వ్యాపార విలువ పెరగుతుందని కంపెనీ ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ నిపుణుల్లో విశాల్‌ ఒకరు. విశాల్‌ రాకతో నేను వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడటంతోపాటు మా వినియోగదారులను సరైన దిశలో నడిపించగలం’’ అని ఒరాకిల్‌ ఛైర్మన్‌, సీటీవో లారీ ఎల్లిసన్‌ తెలిపారు. 

ఒరాకిల్ సీఈవో సాఫ్రా కాట్జ్‌ మాట్లాడుతూ ‘అత్యాధునిక క్లౌడ్‌ అప్లికేషన్లు, సాంకేతికతలను వేగంగా వినియోగంలోకి తేవడం కంపెనీ మార్పునకు దోహదపడుతుంది. ఒరాకిల్‌ జెన్‌2 క్లౌడ్‌ వసతులు, అటానమస్‌ డేటాబేస్‌, ఇతర అప్లికేషన్లు కలిస్తే మా వినియోగదారుల వ్యాపారాలను ఎలా ముందుకు తీసుకెళ్లగలవో విశాల్‌కు బాగా తెలుసు’ అని పేర్కొన్నారు.

also read బీకేర్‌ఫుల్: పవర్‌ ఆఫ్‌ అటార్నీపై ఇన్వెస్టర్లకు ఎన్ఎస్ఈ అడ్వైజరీ

దీనిపై విశాల్‌ సిక్కా స్పందిస్తూ ‘‘కొన్నేళ్లుగా ప్రపంచంలోని ప్రతి పెద్ద సంస్థలకు గుండెచప్పుడుగా ఒరాకిల్‌ డేటాబేస్‌ ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ప్రతి నాలుగు పెద్ద క్లౌడ్‌ కంపెనీల్లో ఒక్కటి మాత్రమే ఎంటర్‌ ప్రైజస్‌ అప్లికేషన్‌ సూట్‌, సెక్యూర్‌ ఇన్ఫ్రా సాంకేతికతలు సంయుక్తంగా అందజేస్తున్నాయి. ఒరాకిల్‌కు అప్లికేషన్స్‌, ఇన్ ఫ్రాలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది కంపెనీకి భవిష్యత్‌లో అద్భుతమైన సృజనాత్మకత, వృద్ధికి బాటలు పరుస్తుంది. ఈ ప్రయాణంలో నేనుకూడా భాగస్వామిని అయినందుకు సంతోషిస్తున్నా’ అని అన్నారు.