ట్రంప్ ప్లాన్ సక్సెస్.. ఎలాన్ మస్క్ పిచ్చ హ్యాపీ.. టెస్లా షేర్ ధర పైపైకి..
Trump Buys Red Tesla: అమెరికాలో ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న వేళ ట్రంప్ మస్క్ కు మద్దతుగా నిలిచారు. ట్రంప్ టెస్లా కారు కొనడంతో ఆ కంపెనీ షేర్లు అమాంతం పెరిగాయి. అసలు మస్క్ పై ఎందుకు వ్యతిరేకత వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం రండి.

అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో టెస్లా వ్యాపారం పడిపోయిన వేళ, ఎలాన్ మస్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలిచారు. మస్క్‌కు మద్దతుగా టెస్లా కారు కొంటానని ట్రంప్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు ట్రంప్ తన మాట ప్రకారం టెస్లా మోడల్ ఎక్స్ కారు కొన్నారు. దీని వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్, తన కొడుకుతో కలిసి వైట్ హౌస్ దగ్గర కారులో ఉన్న వీడియో వైరల్ అవుతోంది.
ట్రంప్ కొన్న టెస్లా కారు ధర ఎంతో తెలుసా?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం డొనాల్డ్ ట్రంప్ కొన్న కారులో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. కారు చాలా బాగుందని ట్రంప్ మెచ్చుకున్నారు. ఈ లగ్జరీ కారు కోసం ట్రంప్ 90,000 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.78,50,777 ఖర్చు చేశారు.
ఎలాన్ మస్క్‌కు మద్దతుగా డొనాల్డ్ ట్రంప్ టెస్లా కంపెనీ నుంచి ఎరుపు రంగు కారు కొన్నారు. కానీ భద్రతా కారణాల వల్ల ఆయన ఈ కారును నడపలేరని అంటున్నారు. టెస్లా మోడల్ ఎక్స్ కారు ప్రత్యేకతల గురించి చెప్పాలంటే.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 529 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ కారు 0 నుంచి 60 వేగాన్ని కేవలం 3.8 సెకన్లలో అందుకుంటుంది. ఈ బ్యాటరీకి కంపెనీ 8 ఏళ్ల వారంటీ ఇస్తోంది.
ఇది కూడా చదవండి ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ కలర్‌లో చంద్రుడు కనిపించేది అప్పుడే
టెస్లాపై, మస్క్ పై అమెరికాలో వ్యతిరేకత
టెస్లా కంపెనీ వాహనాలు, షోరూమ్‌లు, ఛార్జింగ్ స్టేషన్‌లను వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ టెస్లా కారు కొని ఇలా మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా ఎలాన్ మస్క్ దేశభక్తుడని, అతడిని శిక్షించలేమని ట్రంప్ అన్నారు. టెస్లా కంపెనీ షేర్ల ధర పడిపోతున్నప్పుడు ట్రంప్ కారు కొనడం వల్ల టెస్లా కంపెనీ షేర్ల ధర పెరిగింది.
ఎలాన్ మస్క్‌కు ట్రంప్ సపోర్ట్
ఎలాన్ మస్క్‌కు మద్దతుగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో పెద్ద ప్రకటన చేశారు. టెస్లాను బహిష్కరించడాన్ని ఖండించారు. అది ఎలాన్ మస్క్‌పై దాడి అని అన్నారు. టెస్లా, మస్క్ అమెరికాకు చాలా చేశారని ట్రంప్ అంటున్నారు. కానీ మస్క్‌ను టార్గెట్ చేసి "తీవ్ర లెఫ్టిస్టులు" దాడి చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.
మస్క్ గవర్నమెంట్ ఉద్యోగులను తొలగించాలనడమే కారణం
ట్రంప్ పాలనలో గవర్నమెంట్ ఎఫిషియెన్సీ డిపార్ట్‌మెంట్ కు (DOGE) ఎలాన్ మస్క్ హెడ్‌గా ఉన్నారు. ఆయన తనకున్న పవర్స్ ని ఉపయోగించి గవర్నమెంట్ ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమే నిరసనలకు కారణంగా తెలుస్తోంది. మస్క్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోస్టర్లు అంటించి టెస్లా ప్లాంట్ బయట నిరసన చేస్తున్నారు. చాలా నిరసనలు శాంతియుతంగా జరిగినప్పటికీ కొన్ని టెస్లా ఫ్యాక్టరీలలో, షోరూమ్‌లలో నష్టం జరిగింది. వైట్ హౌస్‌లో జరిగిన ఒక మీటింగ్‌లో అమెరికాలో వాహనాల ఉత్పత్తిని రెట్టింపు చేసే ఆలోచన ఉందని ఎలాన్ మస్క్ చెప్పారు.
ఇది కూడా చదవండి హమ్మయ్యా.. అక్కడుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా భయం లేదు! ప్రపంచంలో సేఫెస్ట్ దేశాలు ఇవే