దేశ రాజధానితో సహ ప్రముఖ నగరాల్లో నేడు పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి. సెప్టెంబర్ 1న అంటే మంగళవారం రోజున మెట్రో నగరాలలో పెట్రోల్ ధర 4-5 పైసలు పెంచారు, డీజిల్ ధరలలో  మాత్రం ఎలాంటి మార్పు లేదు.

ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.82.03 పైసల నుండి రూ.82.08కు పెంచగా, డీజిల్ ధర లీటరుకు రూ.73.56 వద్ద ఉందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్స్ తెలిపింది.

ముంబైలో పెట్రోల్ ధరను లీటరుకు రూ.88.68 నుంచి రూ.88.73 పెంచగా, డీజిల్ ధర లీటరుకు రూ.80.11 వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతం, దేశంలోని అత్యధిక ఇంధన కేంద్రాలను కలిగి ఉన్న ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం ప్రతిరోజూ ఉదయం పెట్రోల్, డీజిల్ రేట్లను సమీక్షిస్తాయి.

ఏదైనా సవరణలను ఉంటే వాటిని  ఉదయం 6 గంటల నుండి అమలు చేస్తాయి. ఢీల్లీలోగత 17 రోజులలో 14సార్లు పెట్రోల్ ధరలను పెంచారు. అదే సమయంలో పెట్రోల్ ధర దేశ రాజధానిలో లీటరుకు రూ.1.65 పెంచారు.

also read విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అంతర్జాతీయ విమానాల‌పై నిషేధం మళ్ళీ పొడిగింపు.. ...

గత కొద్ది రోజులుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ ధరను పెంచుతూ వస్తున్నాయి.ఆగస్ట్‌ 1వతేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.2 వరకు ధర పెరిగింది. 

ఢీల్లీ   పెట్రోల్ ధర రూ.82.08, డీజిల్ ధర  రూ.73.56
కోల్‌కతా పెట్రోల్ ధర రూ.83.57, డీజిల్ ధర  రూ. 77.06
ముంబై పెట్రోల్ ధర రూ.88.73, డీజిల్ ధర  రూ. 80.11
చెన్నై పెట్రోల్ ధర రూ.85.04, డీజిల్ ధర  రూ. 78.86
హైదరాబాద్‌లో ట్రోల్ ధర రూ.85.30, డీజిల్ ధర రూ.80.17.

ముడి చమురు, విదేశీ మారక రేట్లు, స్థానిక పన్నుల వంటి కారణాల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 27 సెంట్లు అంటే 0.6 శాతం పెరిగి బ్యారెల్ 45.55 డాలర్లకు చేరుకోగా, యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) క్రూడ్ ఫ్యూచర్స్ 21 సెంట్లు అంటే 0.5 శాతం పెరిగి 42.82 డాలర్లకు చేరుకుంది.