న్యూ ఢీల్లీ: పెరుగుతున్న కోవిడ్ -19 సంక్షోభం కారణంగా భారతదేశం నుండి అంతర్జాతీయ విమానాల సస్పెన్షన్ సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. అయితే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఆమోదించిన అంతర్జాతీయ ఆల్-కార్గో, అంతర్జాతీయ షెడ్యూల్ విమానాలకు ఈ నిషేధం వర్తించదని ఏవియేషన్ రెగ్యులేటర్ సోమవారం తెలిపింది.

అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను పూర్తిస్థాయిలో తిరిగి ప్రారంభించడం అనేది ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి స్థితిపై ఆధారపడి ఉంటుందని డిజిసిఎ చీఫ్ అరుణ్ కుమార్ ఆగస్టు 9న చేసిన ప్రకటన తర్వాత ఈ తాజా చర్య వచ్చింది.

"ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికీ నిర్బంధ చర్యలను అమలు చేస్తున్నాయి. పూర్తిగా అంతర్జాతీయ విమానాలను ప్రారంభించటానికి మరికొంత సమయం పడుతుంది" అని అరుణ్ కుమార్ అన్నారు. "డిజిసిఎ ప్రత్యేకంగా ఆమోదించిన అంతర్జాతీయ ఆల్-కార్గో కార్యకలాపాలు, విమానాలకు ఈ సస్పెన్షన్ వర్తించదు.

also read రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి ఫ్యూచర్‌’ గ్రూప్‌.. 24వేల కోట్ల డీల్.. ...

ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమానాలను అనుమతించవచ్చు, ”అని డిజిసిఎ ఆదేశంలో పేర్కొంది. యుఎస్ఎ, యుకె, ఫ్రాన్స్, జర్మనీ, యుఎఇ, ఖతార్, మాల్దీవులతో భారతదేశం ఎయిర్ బబుల్ ఒప్పందం  ఏర్పాటు చేసిందని, మరో 13 దేశాలతో ఇటువంటి ఏర్పాట్లను చేసే ప్రయత్నంలో భారత ప్రభుత్వం ఉందని తెలిపింది.

విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. సెప్టెంబ‌ర్ ఒక‌ట తేదీ నుంచి 31 వ‌ర‌కు ఆర‌వ ద‌శ వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్ట‌నున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది.

భారతదేశానికి రావడానికి వందేభార‌త్  పథకం కింద నడుస్తున్న డిజిసిఎ ఆమోదించిన ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను లక్షలాది మంది సద్వినియోగం చేసుకున్నారు.

కోవిడ్‌-19 నేప‌థ్యంలో ప్రభుత్వం మొదట అంతర్జాతీయ, దేశీయ విమానాలను మార్చిలో నిషేధించింది. అంతర్జాతీయ ప్రయాణాల నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగించింది. దేశీయ విమాన కార్యకలాపాలను మే 25 న తిరిగి ప్రారంభించడానికి అనుమతించారు.